Sabarimala : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన కేరళ సర్కార్ .. భక్తుల సంఖ్య పెంపు అమలు

అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై సాధారణ రోజులలో రోజుకు రెండు వేల మంది భక్తులను స్వామి దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. వారాంతాల్లో మూడు వేల మంది భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు . ఈమేరకు దేవాదాయ శాఖ మంత్రి కదకం పల్లి సురేంద్రన్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

Recommended Video

    #SabarimalaTemple: కేరళలో భక్తుల సంఖ్య పెంచాలని నిర్ణయం ... మకరవిలక్కు పూజకు 5 వేలమందికి అనుమతి !
    సాధారణ రోజుల్లో రెండు వేల మంది .. వారాంతాల్లో మూడు వేల మంది

    సాధారణ రోజుల్లో రెండు వేల మంది .. వారాంతాల్లో మూడు వేల మంది

    ఇప్పటివరకు సాధారణ దినాల్లో రోజుకు వెయ్యి మందిని అనుమతించి, వారాంతాల్లో రెండు వేల మందికి దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం సాధారణ రోజుల్లో రెండు వేల మందిని, శని, ఆదివారాల్లో మూడువేల మందికి స్వామి దర్శనం కల్పించనున్నారు. కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలలో మండల, మకరవిళక్కు పూజల కోసం రెండు నెలల పాటు ఆలయాన్ని తెరిచిన విషయం తెలిసిందే.

    కేరళలో భక్తుల సంఖ్య పెంచాలని నిర్ణయం ... మకరవిలక్కు పూజకు 5 వేలమందికి అనుమతి

    కేరళలో భక్తుల సంఖ్య పెంచాలని నిర్ణయం ... మకరవిలక్కు పూజకు 5 వేలమందికి అనుమతి

    నవంబర్ 26 న ప్రధాన కార్యదర్శి విశ్వస్ మెహతా అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా కేరళలో అనుమతించే భక్తుల సంఖ్య రోజువారీ 1,000 మరియు వారాంతాల్లో 2,000 నుండి పెంచాలని ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది.అయితే, మండల పూజ, మకరవిలక్కు పూజ రోజులలో శబరిమలకు అనుమతించే యాత్రికుల సంఖ్యను ప్రభుత్వం పెంచలేదు మరియు ఇంతకుముందు ప్రకటించినట్లు ఆ రోజుల్లో మాత్రం 5,000 మందికే అనుమతి ఉంటుంది.

    అయ్యప్ప పూజల కోసం వచ్చే భక్తులు సామాజిక దూర నిబంధనలు పాటించాలని నిర్ణయం

    అయ్యప్ప పూజల కోసం వచ్చే భక్తులు సామాజిక దూర నిబంధనలు పాటించాలని నిర్ణయం

    అదనపు యాత్రికుల కోసం వర్చువల్ క్యూ కోసం బుకింగ్ బుధవారం నుండే ప్రారంభమవుతుండటంతో రోజువారీ పెరుగుదల వెంటనే అమల్లోకి వస్తుందని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టిడిబి) అధ్యక్షుడు ఎన్. వాసు తెలిపారు. అయ్యప్ప స్వామి పూజల కోసం ప్రతిరోజూ 14 గంటలు శబరిమల అయ్యప్ప మందిరం తెరిచినందున స్వామి దర్శనం చేసుకునే భక్తులు కేరళ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా సామాజిక దూర నిబంధనలకు కట్టుబడి ఉండాలని టిడిబి అభిప్రాయపడింది.

    సన్నిధానం వద్ద అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా ..

    సన్నిధానం వద్ద అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా ..

    గతంలో ప్రతిరోజూ 50,000 నుండి ఒక లక్ష వరకు భక్తులు వచ్చేవారు . కానీ ప్రస్తుతం సాధారణ రోజులలో 1,000 మంది మరియు వారాంతాల్లో 2,000 మంది మాత్రమే అనుమతిస్తున్నారు . ఇక ఈ సంఖ్యను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏడాది శబరిమల యాత్రలో సన్నిధానం వద్ద భక్తుల రద్దీ ఉండేది . కానీ ఇప్పుడు కరోనా కారణంగా భక్తుల రద్దీ కనిపించటం లేదు .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+