Sabarimala: అయ్యప్పస్వామి మకరజ్యోతి, అయ్యప్ప నామస్మరణంతో మార్మోగిపోయిన శబరిగిరులు !
శబరిమల/కొచ్చి/హైదరాబాద్: మకర సంక్రాంతి పండుగ గురువారం రోజు సాయంత్రం 6. 43 గంటల సమయంలో శబరిమలలోని పొన్నంబులంమేడు కొండల్లో అయ్యప్పస్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చాడు. అయ్యప్పస్వామి జ్యోతి దర్శనం చేసుకున్న శివభక్తులు, అయ్యప్పస్వామి భక్తుల జీవితం ధన్యం అయ్యింది. అయ్యప్పస్వామి నామస్మరణంతో శబరిగిరులు మార్మోగిపోయాయి.
అయ్యప్పభక్తులు తమ జీవితంలొ ఒక్కసారైన మకర సంక్రాంతి రోజు శబరిమల చేరుకుని అయ్యప్పస్వామి జ్యోతి దర్శనం చేసుకోవాలని ఎన్నో కలలుకంటారు. 2021 సంక్రాంతి పండుగ సందర్బంగా కేవలం 5 వేల మంది అయ్యప్పస్వామి భక్తులకు మాత్రయే శబరిమలలో అయ్యప్పస్వామి జ్యోతి దర్శనం చేసుకోవడానికి అవకాశం చిక్కింది.

గురువారం సాయంత్రం 6 గంటల 43 నిమిషాల సమయంలో శబరిమలలోని పొన్నాంబులంమేడు కొండల్లో అయ్యప్పస్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శబరిగిరులు అయ్యప్పస్వామి నామస్మరణం, స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణాలతో మార్మోగిపోయింది. ఎన్నడూలేని విధంగా అయ్యప్పస్వామి భక్తులు కోవిడ్ నియమాలు పాటిస్తూ, భౌతికదూరం పాటిస్తూ పొన్నంబులంమేడు కొండల్లో దర్శనం ఇచ్చిన జ్యోతిని దర్శించుకుని మా పాపాలు కడిగేసి మాకు మంచి బుద్దిని ప్రసాధించుస్వామి అంటూ అయ్యప్పస్వామిని వేడుకున్నారు.
పొన్నంబులంమేడు కొండల్లో జ్యోతి దర్శనం ఇస్తున్న సమయంలో శబరిమలలోని అయ్యప్పస్వామి సన్నిధిలో అర్చకులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ స్వామికి మంగళహారతులు ఇచ్చారు. అయ్యప్పస్వామి దర్శనం అనంతరం శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానంలో అయ్యప్పస్వామికి ప్రత్యేకంగా గంధంతో అభిషేకం చేసిన గంధాన్ని అరటి ఆకుల్లో పెట్టి భక్తులు, శబరిమల ఆలయ అధికారులకు అందించారు. శబరిమల చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ మంది అయ్యప్పస్వామి భక్తులు 2021 జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి రోజు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications