Sabarimala: శబరిమలలో మంచుపల్లకి, పులకించిపోతున్న భక్తులు, 25 % మందికి చాన్స్ మిస్, మళ్లీ చాన్స్!
శబరిమల/ కొచ్చి/ పంపా: శబరిమలకు వెళ్లిన అయ్యప్పస్వామి భక్తులకు నివర్, బురేవి తుపాన్లు, భారీ వర్షాల కారణంగా కొన్ని సమస్య ఎదురైనాయి. 25 శాతం మంది భక్తులు అనుకున్న సమయానికి శబరిమలలోని సన్నిధానం చేరుకోలేకపోయారని వెలుగు చూసింది. ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారిని లెక్క చెయ్యకుండా శబరిమలకు స్వామియే శరణమయ్యప్ప అంటూ వెలుతున్న అయ్యప్ప భక్తులు భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అయినా అయ్యప్పస్వామి భక్తులు చాలా సంతోషంగా శబరిమలకు వెలుతున్నారు. కేరళలో భారీ వర్షాల కారణంగా ముందుగానే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చెయ్యడంతో అయ్యప్ప భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదు.

వెంటవెంటనే తుపాన్లు
శబరిమలకు అయ్యప్పస్వామి భక్తుల తీర్థయాత్ర మొదలైన తరువాత వరుసగా రెండు తుపాన్లు విరుచుకుపడ్డాయి. నివర్ తుపాను కారణంగా ఇప్పటికే అయ్యప్పస్వామి భక్తులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. తరువాత కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నివర్ తుపాను వెళ్లిపోయింది అనుకుంటున్న సమయంలో మరోసారి బురేవి తుపాను రూపంలో భారీ వర్షాలు పడుతాయని తెలియడంతో అయ్యప్పస్వామి భక్తులు కొంత ఆందోళనకు గురైనారు.

లేనిపోని రూల్స్
కరోనా వైరస్ (COVID- 19) మహమ్మారి దెబ్బకు కేరళ ప్రభుత్వం అయ్యపస్వామి భక్తులకు ఇప్పటికే అనేక నియమాలు విధించింది. అతి కష్టం మీద కేరళ ప్రభుత్వం విధించిన రూల్స్ పాటిస్తూ అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి రెండు నెలల నుంచి ఆన్ లైన్ లో అనుమతి తీసుకుంటున్న అయ్యప్ప భక్తులు శబరిమలకు వెలుతున్నారు. శబరిమలలో అయ్యపస్వామిని దర్శించుకుంటున్న అయ్యప్పస్వామి భక్తులు తరువాత మొక్కులు చెల్లించుకుని వారి సొంత ప్రాంతాలకు చాలా సంతోషంగా వెనుతిరుగుతున్నారు.

అయ్యప్ప భక్తుల ధీక్షమహిమ
కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు పడటంతో శబరిమలకు వచ్చి వెలుతున్న అయ్యప్పస్వామి భక్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని శబరిమల దేవస్వం బోర్డు, కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు ముందుగానే పదేపదే మనవి చేసింది. ఏది ఏమైనా సరే ముందుగా ఆన్ లైన్ లో డేట్ ఫిక్స్ చేసుకున్న అయ్యప్ప భక్తులు అనుకున్న సమయానికి అయ్యప్పస్వామిని దర్శించుకోవాడానికి వెళ్లారు. అయితే భారీ వర్షాల కారణంగా చాలా మంది భక్తులకు సమస్యలు ఎదురుకావడంతో అనుకున్న సమయానికి శబరిమలకు చేరుకోలేకపోయారని అధికారులు అన్నారు.

25 శాతం మంది మిస్ అయ్యారు.... కానీ లక్కీచాన్స్ !
శబరిమలకు కాలినడకన అయ్యప్పస్వామి భక్తులు ప్రతిరోజూ వెళ్లడానికి మొదట వెయ్యి మందికి అవకాశం ఇచ్చిన కేరళ ప్రభుత్వం తరువాత ఆ సంఖ్యను రెండు వేలకు పెంచింది. అయితే భారీ వర్షాల కారణంగా గత శుక్రవారం కేవలం 1, 450 మంది మాత్రమే శబరిమలకు చేరుకున్నారని అధికారుల లెక్కల ప్రకారం తెలిసిందని ఆలస్యంగా వెలుగు చూసింది.

అయ్యప్ప భక్తులు సేఫ్
నివర్, బురేవి తుపాన్లు, భారీ వర్షాల కారణంగా కేరళలో ఇప్పటి వరకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు కానీ, మరణాలు కాని సంభవించలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. తుపాన్ల కారణంగా ముందుగానే అయ్యప్పస్వామి భక్తులను అలర్ట్ చెయ్యడంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. అనుకున్న సమయానికి శబరిమలకు చేరుకోలేని అయ్యప్ప భక్తులకు తరువాత స్వామిని దర్శించుకోవడానికి అవకాశం ఇచ్చారని మలయాళం మీడియా తెలిపింది.
Recommended Video

శబరిమలలో మంచుపల్లకి
గత నాలుగు రోజుల్లో శబరిమలలో భారీ వర్షాల పడ్డాయి. శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానంలోని పరిసర ప్రాంతాల్లోని కొండలు మంచుతో కప్పేశాయి. ఎన్నడూ లేని విధంగా శబరిమల కొండలు మంచుపల్లకిని తలపించడంతో ఆ అనుభూతికి అయ్యప్ప భక్తులు పరవసించిపోతున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శబరిమల గిరులు మంచుతో చూడముచ్చటగా కళకళలాడుతున్నాయి.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications