వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sabarimala: శబరిమలలో మకరవిలక్కుంకు ఏర్పాట్లు, స్వామియేశరణం అయ్యప్ప, ఆరోజు రాజకుటుంబం!

|
Google Oneindia TeluguNews

శబరిమల/ పందలం/ కొచ్చి: పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలలో అయ్యప్పస్వామి మండల పూజలు పూర్తి అయ్యాయి. అయ్యప్పస్వామి భక్తులు ఎంతో పవిత్రంగా భావించి, పూజించే మండల దీక్షను వేలదిమంది భక్తులు పూర్తి చేసుకున్నారు. కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానంలో సాంప్రధాయం ప్రకారం మండల పూజలు పూర్తి అయ్యాయి. శబరిమలలో ఇక మకరవిలక్కు ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి శబరిమల దేవస్వం బోర్డు నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. చివరి రోజు రాజకుటుంబం పూజలు చేసిన తరువాత అయ్యప్పస్వామి ఆలయంలో పూజలు, దర్శనాలకు తెరపడుతుంది.

Sabarimala: అయ్యప్పకు 453 సవర్ల బంగారు నగలతో అలంకరణ, భక్తులకు నో చాన్స్, మండల పూజ రోజు!Sabarimala: అయ్యప్పకు 453 సవర్ల బంగారు నగలతో అలంకరణ, భక్తులకు నో చాన్స్, మండల పూజ రోజు!

ప్రధాన అర్చకుడు

ప్రధాన అర్చకుడు

శబరిమల ప్రధాన (చీఫ్) అర్చకుడు కండరారు రాజవర్ నేతృత్వంలో అయ్యప్పస్వామి సన్నిధానంలొ ఒక రోజు పూర్తిగా 41 రోజుల అయ్యప్పస్వామి మండల పూజలు ఘనంగా నిర్వహించారు. అయ్యప్పస్వామి మండల పూజలు అర్చకులు, భక్తులు ఎంతో పవిత్రంగా భక్తిశ్రద్దలతో నిర్వహించారు.

అయ్యప్పస్వామి నగలు

అయ్యప్పస్వామి నగలు

మండల పూజకు ముందు అయ్యప్పస్వామికి ఎంతో ఇష్టం అయిన తంక-అంకి కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్పస్వామికి తరతరాలుగా అలకంరిస్తున్న బంగారు నగలతో స్వామిని చాలా అందంగా అలంకరించారు. అయ్యప్పస్వామి బంగారు నగలతో దర్శనం ఇవ్వడంతో అయ్యప్ప భక్తులు పులకించిపోయారు.

 డిసెంబర్ 30 వరకు ఆలయం మూత

డిసెంబర్ 30 వరకు ఆలయం మూత

శబరిమలలో అయ్యప్పస్వామికి మండల పూజలు పూర్తి అయిన తరువాత ఆలయం మూసివేశారు. డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అయ్యప్పస్వామి సన్నిధానం మూతపడటంతో స్వామిని దర్శించుకోవడానికి అయ్యప్పస్వామి భక్తులకు అవకాశం లేదు. డిసెంబర్ 31వ తేదీన మళ్లీ అయ్యపస్వామిని దర్శించుకోవడానికి సామాన్య భక్తులకు అవకాశం ఇస్తారు.

మకరవిలక్కు ఉత్సవాలు

మకరవిలక్కు ఉత్సవాలు

శబరిమలలో అయ్యప్పస్వామి మకరవిలక్కు ఉత్సవాలు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 11వ తేదీన ఏరిమేళిలో పట్టేతుళ్ళాల్ ఉత్సవాలు నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్దం చేస్తున్నారు. ఏరిమేళిలో పట్టేతళ్ళాల్ ఉత్సవాలు మొదలైన మరుసటి రోజు పందలంలో శబరిమల తిరువాభరణం ఊరేగింపు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 జనవరి 14 మకరవిలక్కు

జనవరి 14 మకరవిలక్కు


2021 జనవరి 14వ తేదీన మకరవిలక్కు ఉత్సవం రంగరంగ వైభంగా నిర్వహిస్తారు. జనవరి 19వ తేదీన శబరిమలలోని మలికాప్పురం దేవి దేవాలయంలో మకరవిలక్కు వార్షిక ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించడానికి సర్వం సిద్దం చేస్తున్నారు. జనవరి 20వ తేదీన ఉదయం శబరిమల రాజకుటుంబం కుటుంబ సభ్యులు అయ్యప్పస్వామిని ప్రత్యేకంగా దర్శించుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజకుటుంబ సభ్యులు అయ్యప్పస్వామిని దర్శించుకున్న తరువాత శబరిమలలోని ఆలయం మూసివేస్తారు.

English summary
Sabarimala: Sabarimala temple was closed after 41 day mandala pooja willbe reopened from Dec 30 evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X