Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శబరిమల యాత్ర నవంబర్ 16 నుండి.. వర్చువల్ క్యూ విధానం.. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి

దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో దర్శనాలపై ఆంక్షలు విధించారు .షిరిడి వంటి చాలా పుణ్యక్షేత్రాలలో ఇప్పటికీ భక్తులకు దర్శనాలు లేవు. ఈ క్రమంలో అయ్యప్పస్వామి మాల వేసుకుని, అత్యంత నిష్టతో పూజాధికాలు నిర్వహించి, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి శబరిమలకి వెళ్లి స్వామిని దర్శించుకునే అయ్యప్ప భక్తులకు ఈ సారి శబరిమల యాత్ర ఉంటుందా ? ఉండదా? అన్న ప్రశ్నలకు సమాధానం చెబుతూ కేరళ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటించింది.

 శబరిమల యాత్రకు కేరళ సర్కార్ గ్రీన్ సిగ్నల్

శబరిమల యాత్రకు కేరళ సర్కార్ గ్రీన్ సిగ్నల్

శబరిమలకి వచ్చే భక్తులకు నవంబర్ 16వ తేదీ నుండి దర్శనాలకు అనుమతించబోతున్నట్లుగా దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ వెల్లడించారు. అయితే కరోనా నిబంధనలకు అనుగుణంగా,నిబంధనలు పాటిస్తూ భక్తులు యాత్ర చేయాల్సి ఉంటుందని తెలిపారు. శబరిమల యాత్ర భక్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేరళ సర్కార్ శబరికి వచ్చే భక్తులు ఖచ్చితంగా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లు తీసుకొని వస్తేనే అనుమతిస్తామని పేర్కొన్నారు.

కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి

కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి


ఐసిఎంఆర్ గుర్తింపు ఉన్న ల్యాబ్ లలో పరీక్షలు చేయించుకుని కరోనా నెగిటివ్ వస్తేనే శబరికి రావాలని, వారితో పాటు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లు కూడా తీసుకువస్తేనే అనుమతిస్తామని తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులందరికీ స్క్రీనింగ్ చేస్తామని, వారికి కావలసిన మార్కులు శానిటైజర్ లను అందిస్తామని కరోనా వ్యాప్తి జరగకుండా దేవాదాయ శాఖ నుండి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.వర్చువల్ క్యూ విధానం ద్వారా భక్తుల సంఖ్యను పరిమితం చేస్తామని పేర్కొన్నారు. శబరిమలై కొండకు వచ్చే భక్తులు భౌతిక దూరం పాటించాలని, తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

 కరోనా నేపధ్యంలో శబరి యాత్ర చేసే భక్తుల కోసం ఏర్పాట్లు

కరోనా నేపధ్యంలో శబరి యాత్ర చేసే భక్తుల కోసం ఏర్పాట్లు

ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల నేపథ్యంలో భక్తులకు వైద్య సేవలు అందించడం కోసం సన్నిధానం, నీలక్కల్, పంబా ప్రాంతాలలో వైద్య సేవలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం పంబా, నీలక్కల్ మధ్య బస్సులు కూడా నడుపుతామని పేర్కొన్నారు. విపత్తుల నిర్వహణ కోసం హెలికాప్టర్ సర్వీసులు కూడా అందుబాటులో ఉంచాలని పతనంతిట్ట కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరగా ,అందుకు అంగీకరించినట్లుగా సమాచారం.

Recommended Video

    Khairtabad Ganesha : No Permission For Devotees To Visit Khairatabad Ganesha
    కరోనా ప్రోటోకాల్ ప్రకారమే అయ్యప్ప దర్శనం

    కరోనా ప్రోటోకాల్ ప్రకారమే అయ్యప్ప దర్శనం


    దర్శనానికి భక్తులను అనుమతించినా COVID-19 ప్రోటోకాల్‌ ప్రకారం భక్తుల ప్రవేశం ఒకేసారి ఐదుగురికి మాత్రమే పరిమితం చేయబడుతుంది.మహమ్మారికి వ్యతిరేకంగా ముందుజాగ్రత్తగా ట్రావెన్కోర్ దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న అన్ని ఆలయాలలో నాలుగు నెలలకు పైగా భక్తుల దర్శనాలను నిషేధించింది.మొత్తానికి అయ్యప్ప మాల ధారుల కోసం శబరిమల యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అందుకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నం కానుంది .

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+