పార్లమెంటులో టెండూల్కర్: కరచాలనం చేసిన యువ ఎంపీలు
న్యూఢిల్లీ: క్రికెట్ లెజెండ్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ గురువారంనాడు పార్లమెంటుకు వచ్చారు. ఆయన హాజరు సహచర పార్లమెంటు సభ్యుల దృష్టిని ఆకర్షించింది. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన పార్లమెంటుకు వచ్చారు.
డిఎంకెకు చెందిన టి. శివతో పాటు కొంత మంది పార్లమెంటు సభ్యులు, యువ సభ్యులు దగ్గరకు వచ్చి ఆయనతో కరచాలనం చేశారు. సచిన్ టెండూల్కర్ 2012 ఏప్రిల్‌లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయన అప్పుడప్పుడు మాత్రమే పార్లమెంటుకు హాజరవుతున్నారు.
సచిన్ గైర్జాజరీపై విమర్శలు కూడా వచ్చాయి. గత పార్లమెంటు సమావేశాల్లో ఆయన మూడు రోజులు హాజరయ్యారు. శీతాకాలం సమావేశాలు 22 రోజులు జరిగితే మూడు రోజులు సచిన్ టెండూల్కర్ సభకు వచ్చారు.

నిరుడు వర్షాకాలం సమావేశాలకు సచిన్ టెండూల్కర్ హాజరు కాకపోవడంపై పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులు విమర్శలు చేశారు. సచిన్ గైర్హాజరు కావడం సభను, దేశాన్ని అగౌరవపరచడమేనని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలోని ఓ కార్యక్రమానికి హాజరై కూడా సమావేశాలకు రాకపోవడంపై సచిన్ టెండూల్కర్‌ను వివరణ కోరాలనే డిమాండ్ కూడా వచ్చింది.












Click it and Unblock the Notifications