తుపాకీతో కాల్చుకుని.. సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
ముంబై: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)కు రక్షణగా ఉండే ఒక సెక్యూరిటీ గార్డు తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు సంబంధిత అధికారులు వెల్లడించారు. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్ అయిన ప్రకాశ్ కాప్లే.. సచిన్ వీవీఐపీ సెక్యూరిటీలో విధులు నిర్వర్తిస్తున్నాడు.
మహారాష్ట్రలోని జామ్నెర్ పట్టణంలోని పట్టణంలోని అతడి స్వస్థలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ప్రకాశ్ కాప్టే (39).. కొన్ని రోజులు సెలవు తీసుకుని తన స్వగ్రామానికి వెళ్లినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అక్కడే తన సర్వీస్ తుపాకీతో మెడపై కాల్చుకున్నాడు.

అర్దరాత్రి దాటిన తర్వాత తన ఇంట్లోనే ప్రకాశ్ తన ప్రాణాలు తీసుకున్నట్లు జామ్నెర్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అతడికి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ప్రకాశ్ కాప్టే.. వీవీఐపీ సెక్యూరిటీలోని గార్డు కావడంతో.. ఈ ఘటనపై సీఆర్పీఎఫ్ స్వతంత్ర దర్యాప్తు నిర్వహించనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications