గురుపౌర్ణమి: గురువు రమాకాంత్ ఆచ్రేకర్‌తో సచిన్ సెల్ఫీ
న్యూఢిల్లీ: ఈరోజు గురుపౌర్ణమి. మహర్షి వేద వ్యాసుని పుట్టిన రోజు. అందుకే దీన్ని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. వ్యాస పౌర్ణమిని ఆదిశంకరాచార్యుల వారు తొలిసారిగా నిర్వహించినట్టు చెబుతారు. మానవ జీవితంలో గురువుకు ఉన్న ప్రాధాన్యతను గమనించే తల్లిదండ్రుల తరువాత 'ఆచార్య దేవోభవ' అని అన్నారు.
ఆషాఢ మాసంలో వచ్చే ఈ గురుపౌర్ణమి పర్వదినాన్ని గురువుల దినోత్సవంగా హిందువులు భావిస్తారు. ఈ రోజు గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు సమర్పించి, వారిని సత్కరించి ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. అందుకేనేమో గురుపౌర్ణమి సందర్భంగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన గురువు రమాకాంత్ ఆచ్రేకర్ ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ కూడా గురుపౌర్ణమి సందర్భంగా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
Guru Purnima greetings to everyone. गुरु पूर्णिमा पर हार्दिक शुभकामनायें!
— Narendra Modi (@narendramodi) July 31, 2015 గురుపౌర్ణమిను పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. షిరిడీలో సాయిబాబా తన భక్తులకు తొలిసారిగా ఉపదేశమిచ్చిన రోజు కూడా ఇదే. గురుపౌర్ణమి పురస్కరించుకుని షిరిడిలోని సాయిబాబా ఆలయంలో మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications