వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నకిలీ ఆధార్ తో ఖరీదైన హోటల్లో 5 రోజులు బస చేసిన సచిన్ వాజే.. ఎన్ఐఏ దర్యాప్తు

|
Google Oneindia TeluguNews

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత , ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలతో నింపిన వాహనాన్ని నిలిపి ఉంచిన కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఈ కేసులో అనుమానితుడిని అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారుల విచారణలో సచిన్ వాజే కు చెందిన ఆసక్తికరమైన విషయాలు మరి కొన్ని వెలుగులోకి వస్తున్నాయి.

ముఖేష్ అంబానీకి బెదిరింపు కేసులో అంతా మిస్టరీనే .. సచిన్ వాజే, హిరెన్ మధ్య మంతనాల సీసీటీవీ ఫుటేజ్ముఖేష్ అంబానీకి బెదిరింపు కేసులో అంతా మిస్టరీనే .. సచిన్ వాజే, హిరెన్ మధ్య మంతనాల సీసీటీవీ ఫుటేజ్

స్కార్పియో పోయిందని కేసు పెట్టిన ముందు రోజు ఓ హోటల్ లో బసకు దిగిన సచిన్ వాజే

స్కార్పియో పోయిందని కేసు పెట్టిన ముందు రోజు ఓ హోటల్ లో బసకు దిగిన సచిన్ వాజే

మన్సుఖ్ హిరెన్ స్కార్పియో వాహనం కనిపించకుండా పోయిందని కేసు పెట్టిన ముందురోజు సచిన్ వాజే ఓ నకిలీ ఆధార్ కార్డు తో ముంబైలోని ఖరీదైన హోటల్లో బస చేసినట్లుగా తెలుస్తోంది. అతను దక్షిణ ముంబైలోని హోటల్‌లో బస చేసిన సమయంలో నకిలీ ఆధార్ కార్డు ఉపయోగించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నకిలీ ఆధార్‌లో సచిన్ వాజే తన పేరును సుశాంత్ సదాశివ్ ఖామ్‌కర్ అని పేర్కొన్నారు. అతను తన పుట్టిన తేదీని జూన్ 15, 1972 గా పేర్కొన్నాడు . అయితే అతని అసలు పుట్టిన తేదీ ఫిబ్రవరి 22, 1972. అయితే సచిన్ వాజే అసలు ఫోటోను నకిలీ ఐడిలో ఉపయోగించాడు.

 నకిలీ ఆధార్ కార్డుతో సచిన్ వాజే హోటల్లో బస ... 5 రోజులు హోటల్లోనే

నకిలీ ఆధార్ కార్డుతో సచిన్ వాజే హోటల్లో బస ... 5 రోజులు హోటల్లోనే

ఇక సచిన్ వాజే ఉపయోగించిన ఆధార్ నంబర్ ను 7825 2857 5822 గా పేర్కొన్నారు. అతి ఖరీదైన నారీమన్ పాయింట్ హోటల్ లో ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే ఫిబ్రవరి 16 నుంచి 20వ తేదీ వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ కేసును విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సచిన్ వాజ్ బస చేసిన గదిలో ఆధారాల కోసం శోధిస్తోంది . వాజే ఎందుకు నకిలీ ఐడిని ఉపయోగించాడు ? ఆ హోటల్‌లో ఎందుకు బస చేశాడు ? అతను బస చేసిన సమయంలో వాజేను ఎవరెవరు కలుసుకున్నారు అన్న కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు సాగుతోంది.

 హోటల్ లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న ఎన్ఐఏ అధికారులు

హోటల్ లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న ఎన్ఐఏ అధికారులు

ఎన్ఐఏ అధికారులు హోటల్ లోని సిసి టివి ఫుటేజ్ తీసుకుని సచిన్ వాజే కదలికలను పరిశీలిస్తున్నారు. ఫిబ్రవరి 16 న సచిన్ వాజ్ హోటల్‌కు చెక్-ఇన్ చేసిన ఒక రోజు తర్వాత, మన్సుఖ్ హిరెన్‌కు చెందిన స్కార్పియో దొంగిలించబడిందని కేసు నమోదు చేశారు . ఫిబ్రవరి 16 నుండి 20 వరకు ఐదురోజుల పాటు సచిన్ వాజే ఆ హోటల్ లో ఏం చేశాడు అన్నది ఇప్పుడు అందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న . ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు ముందు ముందు మరిన్ని కీలక విషయాలను వెలుగులోకి తెస్తారో .

 హోటల్ నుండి కొద్ది దూరంలోనే అంబానీ నివాసం

హోటల్ నుండి కొద్ది దూరంలోనే అంబానీ నివాసం

ఆ తర్వాత ఫిబ్రవరి 25 న, ముఖేష్ అంబానీ నివాసం వెలుపల పేలుడు పదార్థాలతో కనుగొనబడింది. స్కార్పియో కారు సచిన్ వాజే వద్ద ఉందని అనుమానిస్తున్నారు . హోటల్ నుండి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబానీ నివాసం ఉండటం కూడా ఈ కేసులో ఆసక్తికి కారణం అవుతుంది. ఈ హోటల్ కి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ముఖేష్ అంబానీకి బెదిరింపు గా ఆంటిలియా వెలుపల స్కార్పియో వాహనాన్నినిలిపి ఉంచారు .

English summary
Arrested Mumbai Police cop Sachin Vaze had used a fake Aadhaar card to check in at a posh hotel in Mumbai a day before Mansukh Hiren’s Scorpio went missing. Sachin Vaze stayed at an upscale hotel at Nariman Point from February 16-20.The team of National Investigation Agency (NIA) visited the hotel and conducted a search of the room where Sachin Vaze stayed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X