వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫైర్: ఊడిన జాబ్, బాస్ కొడుకును చంపిన మహిళ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sacked woman kills boss' son in west Delhi
న్యూఢిల్లీ: తనను ఉద్యోగం నుంచి తొలగించిన మహిళ తన బాస్ కుమారుడిని హత్య చేసింది. ఆమెతో అతనికి అఫైర్ ఉంది. స్టాక్ బ్రోకర్ అసిస్టెంట్ దాడి చేసి అతని కుమారుడిని చంపింది. అదే కత్తితో అతని భార్యపై దాడిచేసి, తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ సంఘటన పశ్చిమ ఢిల్లీలోని మెయిన్‌వాలీలో జరిగింది.

బాస్ కుమారుడిని హత్య చేసిన మహిళ ఆశ ఆస్పత్రిలో కోలుకుంది. ఆమెను పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేశారు. తన తండ్రి సుశీల్ వ్యాపారాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి మృతుడు వరుణ్ గుప్తా ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది.

నిహాల్ విహార్‌లో నివసించే ఆశ గత మూడేళ్లుగా సుశీల్ గుప్తా షేర్ ట్రేడింగ్ కార్యాలయంలో పనిచేస్తోంది. సెప్టెంబర్ 2వ తేదీన ఆమె సుశీల్ గుప్తా నివాసానికి రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో వచ్చింది. ఆ సమయంలో సుశీల్ ఇంట్లో లేడు. ఆయన భార్య అనిత, కుమారుడు వరణ్, కూతురు స్వాతి ఉన్నారు. ఆమె తరుచుగా వస్తుంది కాబట్టి ఆమెపై ఆనుమానం రాలేదు.

వరుణ్ కేకలు పెట్టిన సమయంలో తాను వంటింట్లో ఉన్నానని, స్వాతి తన గదిలో ఉందని, వరుణ్ కేకలు డ్రాయింగ్ రూంలోంచి వినిపించాయని అనిత పోలీసులకు చెప్పింది. వరుణ్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అనిత ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

సుశీల్‌ గుప్తాతో అశకు అఫైర్ ఉందని, తన పెట్టుబడిని సుశీల్ గుప్తా షేర్ ట్రేడింగ్ నుంచి రియల్ ఎస్టేట్‌కు బదలాయించే క్రమంలో ఆశను ఉద్యోగం నుంచి తీసేశాడని, దాన్ని వరుణ్ గుప్తా తన చేతుల్లోకి తీసుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. వరుణ్ వల్లనే తన ఉద్యోగం పోయిందని, అందువల్ల కక్ష తీర్చుకోవాలని అనుకున్నానని ఆశ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

English summary
After being sacked by her employer with whom she had an affair, a 26-year-old stockbroker's assistant stabbed his son to death at west Delhi's Mianwali. Then she attacked his wife and finally attempted to commit suicide with the same knife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X