Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పంజాబ్ లో ఎన్నికలకు ముందు శిరోమణి అకాలీదళ్ కార్యకర్త దారుణహత్య; కాంగ్రెస్ పనేనని ఆరోపణ

పంజాబ్లో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పలు చిట్ల ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి రోజైన శుక్రవారం నాడు పంజాబ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో, బటాలాలోని ఫతేగర్ చురియన్ నియోజకవర్గంలో శిరోమణి అకాలీదళ్ కార్యకర్త హత్యకు గురయ్యాడు.

 శిరోమణి అకాలీదళ్ కార్యకర్త హత్య.. కాంగ్రెస్ పై ఆరోపణలు

శిరోమణి అకాలీదళ్ కార్యకర్త హత్య.. కాంగ్రెస్ పై ఆరోపణలు

శిరోమణి అకాలీదళ్ కు చురుకైన మద్దతుదారుగా ఉన్న 34 ఏళ్ల కరమ్‌జిత్ సింగ్, తన తండ్రితో కలిసి ఓట్ల కోసం ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు దాడి చేసి దారుణంగా హతమార్చినట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేయగా, దాడికి కాంగ్రెస్‌ పార్టీ సూత్రధారిగా మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

 ఎన్నికల ప్రచారంలో శిరోమణి అకాలీ దళ్ కార్యకర్తపై పలువురి దాడి

ఎన్నికల ప్రచారంలో శిరోమణి అకాలీ దళ్ కార్యకర్తపై పలువురి దాడి

ఇదే విషయంపై కరమ్‌జిత్ సింగ్ తండ్రి గుర్వంత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. 'అకాలీదళ్‌తో సంబంధం ఉన్నందున ఓట్ల కోసం ఎన్నికల ప్రచారాన్ని చేశామని, ఇదే సమయంలో యువకుడు తమ వద్దకు వచ్చి దుర్భాషలాడాడు' అని అన్నారు. ఈ ఘర్షణలో జతీందర్ పాల్ సింగ్, బల్వీందర్ సింగ్, తాజిందర్‌పాల్ సింగ్, ముఖ్తియార్ సింగ్, గుర్విందర్ సింగ్, జస్వంత్ సింగ్ మరియు ఇతరులతో పాటు మరికొందరి పేర్లను ప్రస్తావిస్తూ, వారు తమ వద్దకు వచ్చి కరమ్‌జిత్‌పై దాడి చేయడం ప్రారంభించారని ఆరోపించారు.

ఓట్ల కోసమే తన కుమారుడిపై దాడి చేసి హతమార్చారని తండ్రి ఆరోపణ

ఓట్ల కోసమే తన కుమారుడిపై దాడి చేసి హతమార్చారని తండ్రి ఆరోపణ

తన కొడుకు క్రింద పడిపోయి అపస్మారక స్థితికి చేరుకునే వరకు కూడా వారు అతనిపై దాడి చేస్తూనే ఉన్నారని తండ్రి ఆరోపించారు. వారితో మాకు ఎలాంటి గొడవలు లేవని ఆయన పేర్కొన్నారు. ఓట్లు పోతాయనే భయంతో తన కుమారుడిపై దాడికి పాల్పడిన నిందితులు పదునైన ఆయుధాలతో దాడికి పాల్పడ్డారని మృతుడి తండ్రి ఆరోపించాడు.

ఘర్షణలో ఎస్‌ఏడీ కార్యకర్త మృతి.. ఇద్దరిని అరెస్ట్ చేశామన్న పోలీసులు

ఘర్షణలో ఎస్‌ఏడీ కార్యకర్త మృతి.. ఇద్దరిని అరెస్ట్ చేశామన్న పోలీసులు

బటాలా పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, శుక్రవారం సాయంత్రం తన ప్రచారం చివరి రోజున అకాలీదళ్ అభ్యర్థి లఖ్‌బీర్ సింగ్ లోధినంగల్ నిర్వహించిన రోడ్‌షోలో ఎస్‌ఎడి మరియు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో షీరా, పట్టి షీరా గ్రామాల సర్పంచ్‌లు తజిందర్‌పాల్‌ సింగ్‌, జస్వంత్‌సింగ్‌లు కరమ్‌జిత్‌పై దాడి చేశారు. కాంగ్రెస్‌కు చెందిన వారిద్దరూ బేస్‌బాల్ బ్యాట్‌తో ఎస్‌ఏడీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన అతడిని సివిల్‌ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+