వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిద్దూపై బిక్రమ్ సింగ్ పోటీ.. ఎన్నికల బరిలో కురువృద్దుడు బాదల్

|
Google Oneindia TeluguNews

పంజాబ్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నాయి. అభ్యర్థులను ప్రకటిస్తూ ముందడుగు వేస్తున్నాయి. శిరోమణి అకాళిదల్ ఇద్దరు అగ్ర నేతలకు టికెట్ కేటాయించింది. మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ లంబీ నుంచి, ఎమ్మెల్యే బిక్రమ్ సింగ్.. సిద్దూపై బరిలోకి దిగుతారు. ఈయన నార్కొటిక్స్ కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ అమృత్ సర్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తోండగా.. ఎస్ఏడీ నుంచి బిక్రమ్ పోటీలో ఉన్నారు. ఆయన గట్టి పోటీని ఇస్తారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

బిక్రమ్ సింగ్.. ఎస్ఏడీ ప్రెసిడెంట్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ బావమరిది. సిద్దూను ఎదుర్కొని బరిలోకి దిగుతారని సుఖ్ బీర్ సింగ్ తెలిపారు. అలాగే తన తండ్రి కూడా పోటీ చేయడం తమ పార్టీకి కొత్త ఉత్సాహం కలిగిస్తోందని తెలిపారు. ప్రకాశ్ సింగ్ ఇప్పటికీ రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని తెలిపారు. పంజాబ్, పంజాబీల సంక్షేమం కోసం ఆయన పనిచేస్తున్నారని వివరించారు.

SAD pits Majithia against Sidhu; 94 year old badal joins race

మరోవైపు విక్రమ్ యాంటిసిపెటరీ బెయిల్‌ను పంజాబ్, హర్యానా హైకోర్టు సోమవారం తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తమ పార్టీ నుంచి ఆయన పోటీ చేయడం పక్కా అని తెలిపింది. ఇటు సిద్దూకు మాస్ వర్గం నుంచి మంచి ప్రజాధరణ ఉంది. అయినప్పటికీ తమ కార్యకర్తలు మరింతగా ప్రజల్లోకి దూసుకెళతారని సుఖ్ బీర్ చెప్పారు. మిగతా పార్టీల డిపాజిట్ దక్కనీయమని చెప్పారు. గత కొన్నేళ్ల నుంచి ఆయన తన నియోజకవర్గానికి చేసిందేమీ లేదని చెప్పారు. బాబా బాకాలా నుంచి సతీందర్ సింగ్ చాజ్‌వాల్‌వాడీ కుమారుడు రంజిత్ సింగ్‌ను బరిలోకి దింపారు.

ఇటు పంజాబ్ బరిలో కాంగ్రెస్ విద్యావంతులకే టికెట్ కేటాయించింది. కానీ చాలా మంది రాజకీయ కుటుంబాలకు చెందినవారు కూడా ఉన్నారు. రాయికోట్ నుంచి కమిల్ అమర్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఇదీ కూడా ఎస్సీ రిజర్వ్‌డ్ కాగా.. ఇతను ఎంబీఏ చేశారు. యుకేలోని కేంబ్రిడ్జిలో పూర్తిచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఇతని తండ్రి డాక్టర్ అమర్ సింగ్ ఫతేగడ్ సాహిబ్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మాజీ సీఎం ప్రకాశ్ సిం్ బాదల్ కంచుకోట.. లాంబీ నుంచి అతని కుటుంబం నుంచి జగ్ పాల్ సింగ్ అబుల్ ఖురానా బరిలోకి దిగారు. ఇతను గుర్నామ్ సింగ్ కుమారుడు.. ఇతను 1990లో మంత్రిగా పనిచేశారు. బల్వానా ఎస్సీ నియోజకవర్గం నుంచి రాజిందర్ కౌర్ పోటీ చేస్తున్నారు. ఇతను కూడా టీచింగ్ వదిలేసి.. రాజకీయాల్లోకి వచ్చారు. పంజాబీ సింగర్ సిదు మూసేవాలా.. మాన్సా నుంచి పోటీ చేస్తున్నారు. ఘర్షంకర్ నుంచి అమర్ ప్రీత్ సింగ్ లాలీ పోటీ చేస్తున్నారు.

English summary
sad unveiled two big tickets. former cm prakash singh badal to contest lambi seat. mla bikram singh majithia contest amritsar east.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X