శివానంద మూర్తి మృతిపట్ల ప్రధాని సంతాపం: ట్వీట్
న్యూఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు శివానంద మూర్తి (87) మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. "శివానంద మూర్తి తన సేవ, బోధనల ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేశారు. ఆయన మృతి చెందడం విచారకరం. ఆయన అనుచరులందరికీ నా సంతాపం తెలియజేస్తున్నా" అని మోడీ ట్వీట్ చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఆధ్యాత్మికవేత్త సద్గురు శివానందమూర్తి మృతిపట్ల సంతాపం తెలిపారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లో శివానందమూర్తి బహుముఖ సేవలందించారని కొనియాడారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిశారు. వరంగల్‌లోని గురుధం ఆశ్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఎన్‌సీపీ అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైన శరద్ పవార్
నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శరద్ పవార్ తిరిగి ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఆయన్ని ఎన్నుకున్నట్టు పార్టీ వర్గాల ఒక ప్రకటనలో తెలిపాయి. 1999లో పార్టీ స్ధాపించినప్పటి నుంచి పార్టీ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగుతున్నారు.

పార్టీ 6వ జాతీయ సమావేశంలో పవార్‌ను తిరిగి ఎన్నుకున్నట్లుగా పార్టీ ప్రధాన కార్యదర్శి టీపీ పీతాంబర్ వెల్లడించారు. ఈ సమావేశానికి 700 మంది హాజరయ్యారు.












Click it and Unblock the Notifications