Sadist: భార్యతో అసహజ సెక్స్, గ్రూప్ సెక్స్ ?, నగ్న వీడియోలు షేర్, పోలీసులు ఏం చేశారంటే ?, హైకోర్టు ఫైర్ !
బెంగళూరు/ ముంబాయి: ఐఐటీలో చదువుకునే సమయంలో యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. కొంతకాలం ప్రేమించుకున్న యువతి, యువకుడు తరువాత పెళ్లి చేసుకుని కాపురం చేశారు. పెళ్లి చేసుకున్న తరువాత భర్త అతని నిజస్వరూపం చూపించాడు. అసహజ సెక్స్ చెయ్యాలని, తన స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలని, గ్రూప్ సెక్స్ కు అంగీకరించాలని భార్య మీద భర్త ఒత్తిడి చేశాడు. కొంతకాలం భర్త ఆగడాలను భార్య ఓపికగా భరించింది. అయితే భర్తలో ఎలాంటి మార్పురాకపోవడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య కాళ్లు పట్టుకుని మళ్లీ కాపురానికి పిలుచుకుని వచ్చిన భర్త మళ్లీ అసహజ సెక్స్ చెయ్యాలని ఒత్తిడి చేశాడు. భార్య అంగీకరించకపోవడంతో భర్త రగిలిపోయాడు. భార్య ఏకాంతంగా ఉన్న సమయంలో, ఆమె బెడ్ రూమ్ లో ఉన్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలును ఆమె తండ్రితో పాటు బందువులకు షేర్ చేశాడు. ఇక లాభం లేదని భార్య పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు మాత్రం భార్య కేసును లైట్ గా తీసుకుని వరకట్నం వేదింపుల కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. కొన్ని సంవత్సరాలు పోలీసుల చుట్టూ తిరిగిన భార్య హైకోర్టును ఆశ్రయించింది. కేసు వివరాలు తెలుసుకున్న హైకోర్టు పోలీసుల మహిళ కేసు పట్ల ప్రవర్తించిన తీరుపై మండిపడింది. మీరు ఈ కేసును ఏ కోణంలో విచారణ చేశారు, మీ ఉద్దేశం ఏమిటి ? అని పోలీసులను నిలదీసిన హైకోర్టు కేసు విచారణ మరో పోలీసు అధికారికి అప్పగించాలని డీజీపీ ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ ఐఐటీలో చదివిన భర్త శాడిజం గురించి తెలుసుకున్న సామాన్య ప్రజలు షాక్ అయ్యారు.

బాంబే ఐఐటీలో లవ్
బెంగళూరుకు చెందిన యువతి, విక్రమ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడికి 2013లో బాంబే- ఐఐటీలో పీహెచ్ డీ చదివే సమయంలో పరిచయం అయ్యింది. కొంతకాలం ప్రేమించుకున్న విక్రమ్, ఆ యువతి 2015లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తరువాత విక్రమ్ అతని భార్యతో కలసి బెంగళూరులో కాపురం పెట్టాడు.

భర్త శాడిస్టు కోరికలు
పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాలు విక్రమ్ అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. విక్రమ్, అతని భార్య ఉన్నత చదువులు చదువుకోవడంతో ఇద్దరూ మంచి జీతాలు తీసుకున్నారు. 2017లో విక్రమ్ అతని నిజస్వరూపం చూపించాడు. అసహజ సెక్స్ చెయ్యాలని, నేను చెప్పినట్లు పడక సుఖం ఇవ్వాలని విక్రమ్ అతని భార్య మీద ఒత్తిడి చేవాడని ఆరోపణలు ఉన్నాయి.

ఫ్రెండ్స్ కు పడక సుఖం.... గ్రూప్ సెక్స్
అసహజ సెక్స్ చెయ్యడానికి విక్రమ్ భార్య నిరాకరించింది. ఇదే విషయంలో కొంతకాలం దంపతుల మద్య గొడవలు జరిగాయని తెలిసింది. తరువాత తన స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలని, గ్రూప్ సెక్స్ కు అంగీకరించాలని విక్రమ్ అతని భార్య మీద ఒత్తిడి చేశాడు. కొంతకాలం భర్త విక్రమ్ ఆగడాలను ఓపికగా భరించిన అతని భార్య చివరికి భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.

భార్య నగ్న వీడియోలు ఆమె తండ్రికి, బంధువులకు షేర్
భార్య కాళ్లు పట్టుకుని మళ్లీ కాపురానికి పిలుచుకుని వచ్చిన విక్రమ్ మళ్లీ అసహజ సెక్స్ చెయ్యాలని ఆమె మీద పదేపదే ఒత్తిడి చేశాడు. భార్య అంగీకరించకపోవడంతో విక్రమ్ రగిలిపోయాడు. భార్య ఏకాంతంగా ఉన్న సమయంలో, ఆమె బెడ్ రూమ్ లో ఉన్న సమయంలో సీక్రేట్ గా తీసిన ఫోటోలు, వీడియోలును ఆమె తండ్రితో పాటు ఆమె బందువులకు షేర్ చేపి శాడిస్టుగా ప్రవర్తించాడు.

పోలీసులు ఏం చేశారంటే ?
భర్త విక్రమ్ శాడిజం తట్టుకోలేని అతని భార్యకు ఓపిక నసించిపోయి 2017లో బెంగళూరు పోలీసులను ఆశ్రయించి అతని మీద కేసు పెట్టింది. పోలీసులు మాత్రం భార్య కేసును లైట్ గా తీసుకుని విక్రమ్ మీద వరకట్నం వేదింపుల కేసు నమోదు చేశారు. అమె పెట్టిన అసహజ సెక్స్, నగ్న వీడియోలు ఇతరులకు షేర్ చేశాడు అనే ఆరోపణలపై ఐటీ సెక్షనల కింద కేసులు నమోదు చెయ్యకుండా చేతులు దులుపుకున్నారు. కొన్ని సంవత్సరాలు పోలీసుల చుట్టూ తిరిగిన భార్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.

పోలీసులకు చివాట్లు పెట్టిన హైకోర్టు
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న మహిళ కేసు విచారణ చేపట్టారు. మహిళ ఆరోపణలను జస్టిస్ నాగప్రసన్న విన్నారు. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను జస్టిస్ నాగప్రసన్న తెలుసుకున్నారు. కేసు వివరాలు తెలుసుకున్న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి నాగప్రసన్న బెంగళూరు పోలీసులు మహిళ కేసు పట్ల ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు.

డీజీపీకి ఆదేశాలు
మీరు ఈ కేసును ఏ కోణంలో విచారణ చేశారు ?, మీ ఉద్దేశం ఏమిటి ?, బాధితురాలు చేసిన ఫిర్యాదు ఏమిటి ?, మీరు నమోదు చేసిన సెక్షన్లు ఏమిటి అంటూ జస్టిస్ నాగప్రసన్న బెంగళూరు పోలీసులను నిలదీశారు. ఈ కేసు విచారణ మరో పోలీసు అధికారికి అప్పగించాలని, ఇప్పటి వరకు కేసును నిర్లక్షంగా విచారణ చేసిన పోలీసు అధికారుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న కర్ణాటక డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications