హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sadist: వికృత కామాంధుడు, సీరియల్ కిల్లర్, మాజీ పోలీసు ఉమేష్ రెడ్డికి ఉరిశిక్ష ఖరారు, ఆరు వారాలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వికృత కామాంధుడు, సీరియల్ కిల్లర్, మాజీ కానిస్టేబుల్ ఉమేష్ రెడ్డికి ఉరిశిక్ష ఖరారైయ్యింది. ఇంతకాలం ఏదో ఒకరకంగా తాను బతికిపోతాను అని ఊహించుకున్న నరరూప రాక్షసుడు ఉమేష్ రెడ్డికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు సంచలన తీర్చు ఇచ్చింది. ఉమేష్ రెడ్డి ఉరిశిక్ష తీర్పు రద్దు చెయ్యాలని ఇచ్చిన మద్యతంతర తీర్పును హైకోర్టు రద్దు చేసింది. మొత్తం 18 సంవత్సరాల శిక్షకు గురైన ఉమేష్ రెడ్డి ఇప్పటికే 10 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. తన ఉరిశిక్షను రద్దు చెయ్యాలని ఉమేష్ రెడ్డి ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో అక్కడ ఆ కామాంధుడికి చుక్కెదురైయ్యింది. ఉమేష్ రెడ్డి క్షమాభిక్ష అర్జీని రాష్ట్రపతి తిరస్కరించారు. ఇప్పుడు హైకోర్టు కూడా ఉమేష్ రెడ్డి ఉరిశిక్ష ఖరారు చెయ్యడంతో అతనికి ఇప్పుడు అన్నిదారులు మూసుకుపోయాయని న్యాయనిపుణలు ఉంటున్నారు. ఉమేష్ రెడ్డిని త్వరలో ఉరి తియ్యాలని బాధితుల కుటుంబ సభ్యులు హైకోర్టుకు మనవి చేస్తున్నారు.

Illegal affair: ఇంట్లో భర్త శవం పెట్టుకుని ప్రియుడితో ఎంజాయ్ చేసిన ఆంటీ, కామపిచాచి క్లోజ్ !Illegal affair: ఇంట్లో భర్త శవం పెట్టుకుని ప్రియుడితో ఎంజాయ్ చేసిన ఆంటీ, కామపిచాచి క్లోజ్ !

వికృత కామాంధుడు, సీరియల్ హంతకుడు

వికృత కామాంధుడు, సీరియల్ హంతకుడు

కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న సమయంలో ఉమేష్ రెడ్డి అమాయకులైన మహిళ మీద అత్యాచారం చేసి దారుణంగా చంపేశాడు. పోలీసు అనే ధీమాతో ఉమేష్ రెడ్డి చాలా మంది మహిళల జీవితాలు నాశనం చేశాడు. ఇప్పటి వరకు కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉమేష్ రెడ్డి మీద అత్యాచారాలు, సీరియల్ హత్యలు, దోపిడీలతో పాటు మొత్తం 23కు పైగా కేసులు నమొదు అయ్యాయి.

1998లో రాజశ్రీ మీద అత్యాచారం, హత్య, లూటీ

1998లో రాజశ్రీ మీద అత్యాచారం, హత్య, లూటీ


1998 ఫిబ్రవరి 28వ తేదీ రాజశ్రీ అనే మహిళ మీద అత్యాచారం చేసిన కామాంధుడు ఉమేష్ రెడ్డి ఆమెను దారుణంగా చంపేశాడు. రాజశ్రీని హత్య చేసిన తరువాత ఆమె ఇంటిలో బంగారు నగలు లూటీ చేసిన ఉమేష్ రెడ్డి అక్కడి నుంచి పరారైనాడు. రాజశ్రీని హత్య చేసిన సమయంలో ఉమేష్ రెడ్డి కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

అదే టైపు అత్యాచారాలు, హత్యలు

అదే టైపు అత్యాచారాలు, హత్యలు

రాజశ్రీని ఏవిదంగా అత్యాచారం చేసి హత్య చేసి బంగారు నగలు లూటీ చేశాడో ఇదే టైపులో ఉమేష్ రెడ్డి అనేక మంది అమాయక మహిళల మీద అత్యాచారం చేసి దారుణంగా చంపేశాడని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఉమేష్ రెడ్డి పోలీసుగా ఉద్యోగం చేస్తుండటంతో మొదట అతని మీద అనుమానం రాలేదు. తరువాత ఉమేష్ రెడ్డి పాపం పండిపోవడంతో అతని పోలీసులకు చిక్కిపోయాడు.

2006లో ఉమేష్ రెడ్డికి ఉరిశిక్ష విధించిన కోర్టు

2006లో ఉమేష్ రెడ్డికి ఉరిశిక్ష విధించిన కోర్టు

సీనియర్ హంతకుడు, వికృత కామాంధుడు ఉమేష్ రెడ్డికి 2006 అక్టోబర్ 26వ తేదీని సెషన్స్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. తరువాత ఉమేష్ రెడ్డి ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు వికృత కామాంధుడు, సీరియల్ హంతకుడు, మాజీ కానిస్టేబుల్ ఉమేష్ రెడ్డికి ఉరిశిక్ష ఖరారైయ్యింది.

 బతికిపోతానని ధీమా

బతికిపోతానని ధీమా

ఇంతకాలం ఏదో ఒకరకంగా తాను బతికిపోతాను అని ఊహించుకున్న నరరూప రాక్షసుడు ఉమేష్ రెడ్డికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ కర్ణాటక హైకోర్టు బుధవారం సంచలన తీర్చు ఇచ్చింది. మొత్తం 18 సంవత్సరాల శిక్షకు గురైన ఉమేష్ రెడ్డి ఇప్పటికే 10 సంవత్సరాల నుంచి కర్ణాటకలో జైల్లో ఉన్నాడు.

ఆరు వారాలు గడుపు... అయితే ?

ఆరు వారాలు గడుపు... అయితే ?

తన ఉరిశిక్షను రద్దు చెయ్యాలని ఉమేష్ రెడ్డి ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో అక్కడ ఆ కామాంధుడికి చుక్కెదురైయ్యింది. ఉమేష్ రెడ్డి క్షమాభిక్ష అర్జీని రాష్ట్రపతి తిరస్కరించారు. ఇప్పుడు హైకోర్టు కూడా ఉమేష్ రెడ్డి ఉరిశిక్ష ఖరారు చేసింది. ఉమేష్ రెడ్డికి హైకోర్టులో ఖరారైన తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చెయ్యడానికి ఆయన న్యాయవాదికి ఆరు వారాలు గడువు ఉంది.

ఇప్పటికే సుప్రీం కోర్టులో చెక్కెదురైయ్యింది

ఇప్పటికే సుప్రీం కోర్టులో చెక్కెదురైయ్యింది

ఇప్పటికే ఉమేష్ రెడ్డికి ఉరిశిక్ష రద్దు చేసి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని వేసిన పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా ఉమేష్ రెడ్డి క్షమాభిక్ష అర్జీని విచారణకు స్వీకరించే అవకాశం తక్కుగా ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. ఉమేష్ రెడ్డికి అన్నిదారులు మూసుకుపోయాయని న్యాయనిపుణలు ఉంటున్నారు.

English summary
Sadist: Karnataka High Court Announced Death Sentence to Psychotic rapist-killer Umesh Reddy alias Umesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X