Sadist: నిద్రపోతున్న భార్య చెయ్యి పూర్తిగా నరికేసిన భర్త, స్పాట్ లో భర్త ఫ్రెండ్స్, ఏం జరిగిదంటే !

కోల్ కత్తా/బురుద్వాన్: చిన్నప్పటి నుంచి చదువు మీద ఎక్కువ శ్రద్ద పెట్టిన యువతి డిప్లొమో నర్సింగ్ విద్యాభ్యాసం చేసింది. మొదట ప్రైవేట్ కార్పోరేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేసిన యువతికి పెళ్లి అయిపోయింది. భర్త ఇంటికి వెళ్లిన తరువాత ఆమెను ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చెయ్యడానికి వీలులేదని అడ్డుకున్నారు. భర్త చెప్పినట్లు వినాలని అనుకున్న ఆమె ఉద్యోగం మానేసింది. అయితే ఇటీవల భార్యకు ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం వచ్చింది. తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఆమె సంతోషించింది. అయితే ఉద్యోగం చెయ్యడానికి వీలులేదని, నువ్వు బయటకు వెళ్లకూడదని భార్త, అతని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.

ప్రభుత్వ ఉద్యోగం వదలుకుంటే తరువాత ఉద్యోగం రాదని అనుకున్న మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగంలో చేరింది. ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న భార్య మీద అనుమానంతో భర్త రగిలిపోయాడు. అంతే ఫ్రెండ్స్ తో కలిసి భర్త నిద్రపోతున్న అతని భార్య చెయ్యి పూర్తిగా నరికేసి తెగిపోయిన చెయ్యి బ్యాగ్ లో పెట్టి వేరే ప్రాంతంలో దాచిపెట్టి ఎస్కేప్ అయ్యాడు. చెయ్యి పూర్తిగా తెగిపోయిన ప్రభుత్వ ఆసుపత్రి నర్సు బోరున విలపిస్తోంది.

 చదువులో ఫస్ట్

చదువులో ఫస్ట్

పశ్చిమ బెంగాల్ లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లాలోని కేతుగ్రామ్ గ్రామంలో రేణు ఖాతూన్ అలియాస్ రేణు (23) అనే యువతి నివాసం ఉంటున్నది. 2018లో కోల్ కత్తాలోని ఆర్ సీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో జనరల్ నర్సింగ్ డిప్లొమో పూర్తి చేసిన రేణు ప్రభుత్వ ఉద్యోగం సంపాధించి జీవితంలో సెటిల్ అయిపోవాలని అశపడింది.

 పెళ్లి దెబ్బకు ఉద్యోగం మానేసింది

పెళ్లి దెబ్బకు ఉద్యోగం మానేసింది

మొదట దుర్గాపూర్ లోని ప్రముఖ ప్రైవేట్ కార్పోరేట్ ఆసుపత్రిలో రేణు ఉద్యోగం చేసింది. రేణు తండ్రి చిన్న దుకాణం నిర్వహిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోనే రేణు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని ఆదుకుంది. కొంతకాలం తరువాత సరిఫుల్ షేక్ అలియాస్ షేర్ మోహమ్మద్ అనే వ్యక్తితో రేణుకు పెళ్లి అయిపోయింది.

 ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని హ్యాపీ

ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని హ్యాపీ

భర్త షేర్ మోహమ్మద్ ఇంటికి వెళ్లిన తరువాత రేణు ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చెయ్యడానికి వీలులేదని భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. భర్త షేర్ మోహమ్మద్ చెప్పినట్లు వినాలని అనుకున్న రేణు ఉద్యోగం మానేసింది. అయితే ఇటీవల రేణుకు పశ్చిమ బెంగాల్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం వచ్చింది.

 ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన భార్య

ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన భార్య

తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని రేణు చాలా సంతోషించింది. అయితే ఉద్యోగం చెయ్యడానికి వీలులేదని, నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని షేర్ మోహమ్మద్, అతని కుటుంబ సభ్యులు రేణుకు తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం వదలుకుంటే తరువాత ఉద్యోగం రాదని అనుకున్న రేణు భర్తతో గొడవలు పడి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగంలో చేరింది.

 భార్య చెయ్యి పూర్తిగా నరికేసిన భర్త

భార్య చెయ్యి పూర్తిగా నరికేసిన భర్త

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న భార్య రేణు మీద అనుమానంతో ఆమె భర్త ఫేర్ మోహమ్మద్ రగిలిపోయాడు. అంతే ఫ్రెండ్స్ తో కలిసి మోహమ్మద్ నిద్రపోతున్న అతని భార్య రేణు చెయ్యి పూర్తిగా నరికేసి తెగిపోయిన చెయ్యి బ్యాగ్ లో పెట్టి వేరే ప్రాంతంలో దాచిపెట్టి ఎస్కేప్ అయ్యాడు. చెయ్యి పూర్తిగా తెగిపోయిన రేణును ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 టైమ్ కు చెయ్యి చిక్కలేదు

టైమ్ కు చెయ్యి చిక్కలేదు

అయితే రేణుకు తెగిపోయిన ఆమె చెయ్యి సరైన సమయంలో చిక్కలేదని, అందువలన ఆమె చెయ్యి కుదటపడే అవకాశం చాలా తక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారని, రేణు చెయ్యి నరికిన ఆమె భర్త మోహమ్మద్ తో పాటు అతని ఫ్రెండ్స్ పరారైనారని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+