Sadist: భార్య వదిలేసింది, తల్లికి ప్రాణం ఉండగానే ఇంటి వెనుక పూడ్చేసిన కసాయి కొడుకు, చివరికి !

చెన్నై/ విల్లుపురం: వివాహం చేసుకున్న భర్త అతని భార్యతో కాపురం చేసి నలుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. రానురాను భర్త అతని భార్యకు టార్చర్ పెట్టాడు. భర్త చిత్రహింసలు తట్టుకోలేని భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య వదిలేసి వెళ్లిపోవడంతో ఇంకా ఎక్కువ మద్యం సేవిస్తున్న అతను తల్లితో కలసి నివాసం ఉంటున్నాడు. రాత్రి తల్లిని ఇంటిలో నుంచి బయటకు లాగిన కొడుకు ఆమెను చితకబాదేశాడు. పోలీసు కేసు అవుతుందని భయంతో రాత్రికిరాత్రి ఇంటి వెనుక గొయ్యి తీసిన కొడుకు ప్రాణాలతో ఉన్న అతని తల్లిని పూడ్చిపెట్టి చేతులు దులుపుకున్నాడు.

నలుగురు పిల్లలు

నలుగురు పిల్లలు

తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని ముక్తైయూర్ సమీపంలోని చిట్టూరు గ్రామంలో శక్తివేల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం శక్తి వేల్ సెల్వీ మహిళను వివాహం చేసుకున్నాడు. సంతోషంగా వివాహం చేసుకున్న శక్తివేల్ అతని భార్య

సెల్వీతో కాపురం చేసి నలుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు.

భర్త టార్చర్ తట్టుకోలేక పుట్టింటిలో భార్య

భర్త టార్చర్ తట్టుకోలేక పుట్టింటిలో భార్య

గుజరి వస్తువులు సేకరించి వాటిని విక్రయిస్తున్న శక్తివేల్ రోజుపీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లి అతని భార్య సెల్వీని చితకబాదుతున్నాడు. కూలిపనులు చేస్తున్న శక్తివేల్ భార్య సెల్వీ, అతని తల్లి యశోధ నలుగురు పిల్లలను పోషించారు. రానురాను శక్తివేల్ అతని భార్య సెల్వీకి టార్చర్ పెట్టాడు. భర్త శక్తివేల్ చిత్రహింసలు తట్టుకోలేని భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.

కొడుకు దెబ్బతో ఎదురింటిలో నిద్రపోతున్న తల్లి

కొడుకు దెబ్బతో ఎదురింటిలో నిద్రపోతున్న తల్లి

భార్య సెల్వీ వదిలేసి పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోవడంతో ఇంకా ఎక్కువ మద్యం సేవిస్తున్న శక్తివేల్ అతని తల్లి యశోధతో కలసి నివాసం ఉంటున్నాడు. మద్యంకు డబ్బులు ఇవ్వాలని శక్తివేల్ అతని తల్లి యశోధను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. కొడుకు శక్తివేల్ హింస భరించలేని అతని తల్లి యశోధ ఎదురింటిలోని బంధవుల ఇంటిలో రాత్రిపూట నిద్రపోతున్నది.

తల్లి ప్రాణాలతో ఉంటే ఇంటి వెనుక పూడ్చేసిన కొడుకు

తల్లి ప్రాణాలతో ఉంటే ఇంటి వెనుక పూడ్చేసిన కొడుకు

రాత్రి ఎదురింటిలో నిద్రపోతున్న తల్లి యశోధను ఇంటిలో నుంచి బయటకు లాగిన కొడుకు ఆమెను చితబాదేశాడు. రోడ్డు మీద ఈడ్చడంతో యశోధకు తీవ్రగాయాలైనాయి. పోలీసు కేసు అవుతుందని భయంతో రాత్రికిరాత్రి ఇంటి వెనుక గొయ్యి తీసిన శక్తివేల్ ప్రాణాలతో ఉన్న అతని తల్లి యశోధను పూడ్చిపెట్టి చేతులు దులుపుకున్నాడు.

చితకబాదిన బంధువులు

చితకబాదిన బంధువులు

ఉదయం యశోధ కనపడకపోవడంతో ఆమె బంధువులు ఆమె ఇంటికి వెళ్లి చూశారు. ఇంటిలో నిద్రపోతున్న శక్తివేల్ బంధువులను చూసి లోపల డోర్ లాక్ చేశాడు. తలుపులు పగలగొట్టిన బంధువులు శక్తివేల్ ను చితకబాదడంతో అసలు మ్యాటర్ చెప్పాడు. పోలీసులు ఇంటి వెను గొయ్యి తీసి యశోధ శవం బయటకు తిసి విల్లుపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిని చంపేసి ఇంటి వెనుక పూడ్చేసిన కిరాతకుడు శక్తివేల్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+