Sadist: బెడ్ రూమ్ లో భార్య ప్రైవేట్ పార్ట్ లో బాటిల్ చెక్కిన భర్త, శాడిస్టు చేష్టలతో ?, ఫ్యామిలీ, ఎస్కేప్ !

లక్నో/ బరేలి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. జీవితాంతం భర్త, పిల్లలతో సంతోషంగా జీవించాలి అనుకున్న మహిళకు నాలుగు సంవత్సరాల్లోనే నరకం కనపడింది. పెళ్లి చేసుకున్న భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. పాప పుట్టకముందే భార్యను చిత్రహింసలకు గురి చేసిన భర్త కట్నం కోసం చాలా నీఛానికి దిగజారాడు. బెడ్ రూమ్ లో భార్యను పట్టుకున్న భర్త ఆమె మర్మాంగంలో బాటిల్ చెక్కడం కలకలం రేపింది. భర్త ఆగడాల నుంచి తప్పించుకున్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్పీ కార్యాలయం సిబ్బంది విచారణ చెయ్యడంతో భర్త, అతని కుటుంబ సభ్యులు మాయం అయ్యారు. కట్టుకున్న భార్య మర్మాంగంలో బాటిల్ చెక్కాడనే విషయం బాధితురాలు బయటకు చెప్పడం కలకలం రేపింది.

 పెద్దలు చేసిన పెళ్లి

పెద్దలు చేసిన పెళ్లి

ఉత్తరప్రదేశ్ లోని బరేలీలోని ఇజ్జత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాబు (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 2018 జులై 8వ తేదీన బాబుకు, బేబీ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళకు వివాహం అయ్యింది. పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న బేబీ ఆమె భర్త ఇంటికి వెళ్లి కాపురం చెయ్యడం మొదలుపెట్టింది.

 పెళ్లైన సంవత్సరానికే ?

పెళ్లైన సంవత్సరానికే ?

వివాహం చేసుకున్న బాబు, బేబీ దంపతులు సంవత్సరం పాటు సంతోషంగా కాపురం చేశారు. జీవితాంతం భర్త బాబు, పుట్టుబోయే పిల్లలతో సంతోషంగా జీవించాలి అనుకున్న బేబీకి సంవత్సరం తరువాత నరకం కనపడింది. పెళ్లి చేసుకున్న భర్త బాబుతో పాటు అతని కుటుంబ సభ్యులు బేబీని అదనపు కట్నం కోసం చిత్రహింసలకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి.

 అదనపు కట్నం డిమాండ్ చేసిన భర్త, అత్త

అదనపు కట్నం డిమాండ్ చేసిన భర్త, అత్త

బాబుతో పెళ్లి జరిపించే సమయంలో బేబీ కుటుంబ సభ్యులు వారి ఆర్థిక స్థోమతను బట్టి పెళ్లి కొడుకు అడిగినంత కట్నకానుకలు ఇచ్చారని తెలిసింది. పెళ్లి జరిగిన సంవత్సరం పూర్తి అయిన తరువాత అదనపు కట్నం తీసుకురావాలని బాబు తల్లి కోడలు బేబీని టార్చర్ పెట్టింది. మీ అమ్మ కట్నం తీసుకురావాలని టార్చర్ పెడుతోందని బేబీ ఆమె భర్తకు చెప్పింది. మా అమ్మ చెప్పినట్లు నువ్వు వినాలి అంటూ భర్త బాబు చెప్పడంతో బేబీ షాక్ అయ్యింది,

 ఎదురుతిరిగిన మహిళకు టార్చర్

ఎదురుతిరిగిన మహిళకు టార్చర్

అదనపుకట్నం తీసుకురావడానికి బేబీ నిరాకరించింది. అప్పటి నుంచి భర్త బాబుతో పాటు అతని కుటుంబ సభ్యులు బేబీకి నరకం చూపించారని తెలిసింది. ఇదే సమయంలో బేబీ గర్బవతి కావడం, పెద్దలు రాజీలు చెయ్యడంతో పాప పుట్టే వరకు అత్తారింటి వాళ్లు బేబీని వదిలేశారని తెలిసింది. పాప పుట్టిన తరువాత బాబు అతని భార్య బేబీని మళ్లీ టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు.

 భార్య మర్మాంగంలో బాటిల్ చెక్కేసిన భర్త !

భార్య మర్మాంగంలో బాటిల్ చెక్కేసిన భర్త !

భార్య బేబీని చిత్రహింసలకు గురి చేసిన ఆమె భర్త బాబు కట్నం కోసం చాలా నీఛానికి దిగజారాడు. బెడ్ రూమ్ లో భార్య బేబీని పట్టుకున్న భర్త బాబు ఆమె మర్మాంగంలో బాటిల్ చెక్కడం కలకలం రేపింది. భర్త ఆగడాల నుంచి తప్పించుకున్న బేబీ పుట్టింటికి పారిపోయి తరువాత ఆమె భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 శాడిస్టు కోసం గాలిస్తున్న పోలీసులు

శాడిస్టు కోసం గాలిస్తున్న పోలీసులు

బేబీ కేసు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్పీ కార్యాలయం సిబ్బంది విచారణ చెయ్యడంతో భర్త బాబుతో పాటు అతని కుటుంబ సభ్యులు మాయం అయ్యారు. కట్టుకున్న భార్య మర్మాంగంలో బాటిల్ చెక్కాడనే విషయం బాధితురాలు బయటకు చెప్పడం బరేలీలో కలకలం రేపింది. కట్నం కోసం ఇంత నీఛానికి దిగజారిన శాడిస్టు బర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+