Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆమెది రాక్షస జాతి.. అందుకే అలా చేస్తోంది...

హరిద్వార్ : జై శ్రీరాం నినాదాల వివాదంపై బీజేపీ బెంగాల్ సీఎం మమత బెనర్జీని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. పార్టీ ఎంపీల నుంచి కార్యకర్తల వరకు ఈ విషయంలో అందరూ ఆమెను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాక్షస జాతికి చెందిన వారని విమర్శించారు.

దీదీ రాక్షస రాజైన హిరణ్యకశ్యపుడి వంశానకి చెందినవారై ఉంటారని అన్నారు. నారాయణ మంతరి జపించిన సొంత కొడుకు ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడు చిత్రహింసలకు గురి చేసిన వృత్తాంతాన్ని గుర్తు చేసిన సాక్షి మహారాజ్.. ఇప్పుడు మమత బెనర్జీ కూడా అలాగే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Sakshi maharaj alleged that mamata belongs to Hiranyakashyaps Family

జై శ్రీరాం నినాదాలు చేసిన వారిని మమత బెనర్జీ జైలులో పెడుతున్నారని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ ఆరోపించారు. ఆ పదం విన్న వెంటనే ఆమె ఎందుకు అంత ఆగ్రహానికి లోనవుతున్నారో అర్థం కావడంలేదని అన్నారు. ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందోనన్న ఆయన.. మమత ఇంకేం ప్లాన్లు చేస్తున్నారోనని విమర్శించారు.

సాక్షి మహరాజ్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ఓటర్లనుద్దేశించి ఆయన చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ఒకవేళ బీజేపీకి ఓటేయకపోతే నాశనమైపోతారని ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. ఓటర్లనే కాదు.. పార్టీ అధినాయకత్వాన్ని సైతం బెదిరించిన ఘటన సాక్షి మహారాజ్ సొంతం. పార్టీ తన విషయంలో ఎలాంటి ప్రతికూల నిర్ణయాలు తీసుకున్నా అవి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయని, ఆ ఫలితాన్ని పార్టీ అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+