హుక్కా సెంటర్ లో ధోని భార్య.. మేనేజర్ తో కలిసి..
రాంచీ : టీమ్ ఇండియా వన్డే క్రికెట్ కెప్టెన్ ధోని భార్య సాక్షి సింగ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ధోని మేనేజర్ అరుణ్ పాండేతో కలిసి హుక్కా సెంటర్ లో దిగిన ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అరుణ్ పాండే భుజం మీద చెయ్యి వేసి అతని బుగ్గన చుక్కేదో పెడుతున్నట్లుగా ఫోటోకు పోజు ఇచ్చింది సాక్షి. అనంతరం తానే స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోను పోస్ట్ చేసింది. వారం రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ చిత్రానికి వేల సంఖ్యలో నెటిజెన్స్ నుంచి లైక్స్ వచ్చి పడ్డాయి.
అయితే ఈ ఫోటోపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. అరుణ్ తో దిగిన ఫోటో పట్ల కొంతమంది నెటిజెన్స్ సాక్షి హద్దులు దాటి వ్యవహరిస్తోందంటూ విమర్శలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications