సల్లుభాయ్ చెల్లెళ్లను వదలని కరోనా.. ఇద్దరికీ వైరస్
కరోనా ఎవరినీ వదలడం లేదు. నా నీ అనే భేదం అసలు ఉండటం లేదు. సెలబ్రిటీలను కూడ వణికిస్తోంది. కరోనా బారినపడి పలువురు ప్రముఖులు కూడా మృత్యువాత పడ్డారు. తాజాగా సల్మాన్ ఖాన్ చెల్లెళ్లు కూడా వైరస్ సోకింది. సల్మాన్ చెల్లెళ్లు అల్విరా ఖాన్ అగ్నిహోత్రి, అర్పితా ఖాన్ శర్మలకు కరోనా పాజిటివ్ వచ్చింది.
తన చెల్లెళ్లకు కరోనా నిర్ధారణ అయిన విషయాన్ని సల్మాన్ వెల్లడించారు. సెకండ్ వేవ్ పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని, కొవిడ్ ను తేలిగ్గా తీసుకోవద్దని అభిమానులను హెచ్చరించారు. అల్విరా, అర్పితలకు కరోనా సోకిందని.. దేశంలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ ఎంతో ప్రమాదకరంగా ఉందన్నారు. గతంలో... అక్కడ కరోనా కేసులు వచ్చాయి, ఇక్కడ కరోనా కేసులు వచ్చాయి అని విన్నాం... కానీ సెకండ్ వేవ్ లో మన కుటుంబంలోనూ కరోనా కేసులు వచ్చే పరిస్థితి ఏర్పడిందని సల్మాన్ అన్నారు.

గతేడాది ఇంట్లో డ్రైవర్లకు కరోనా సోకిందని.. ఈసారి చాలామందికి వ్యాపించింది" అని వివరించారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో సాయం చేయండంటూ ప్రతిరోజూ అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. సినీ రంగంలో ఉన్న పాతికవేల మంది కార్మికులకు ఆహారం, ఔషధాలు అందిస్తున్నామని సల్మాన్ ఖాన్ వెల్లడించారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications