Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టాయిలెట్ సీట్ నాకించి, విద్యార్ధి మృతికి కారణమైన ర్యాంగింగ్.. సమంత ఆగ్రహం!

కేరళ రాష్ట్రంలో ఒక స్కూల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం, అందుకు దారుణమైన ర్యాగింగ్ కారణం కావడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.కేరళలోని ఎర్నాకులం త్రిప్పునితురలో ఉన్నరాజ్నా పీఎంకు 15 ఏళ్ల కుమారుడు మిహిర్ గ్లోబర్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్నాడు. జనవరి 15వ తేదీన స్కూలుకు వెళ్లి ఇంటికి చేరుకున్న తర్వాత మిహిర్ తాము నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో 26 అంతస్తుకు వెళ్లి అక్కడి నుండి దూకాడు.

ర్యాగింగ్ భూతానికి విద్యార్ధి బలి
మూడవ అంతస్తులో బాల్కనీలో పడి ప్రాణాలు కోల్పోయాడు. అసలు ఎందుకు మిహిర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనేది తెలుసుకోవాలని ప్రయత్నం చేసిన తల్లిదండ్రులు తమ కుమారుడి పట్ల జరిగిన దారుణమైన ఘటన విని షాక్ కు గురయ్యారు. స్కూల్లో మిహిర్ ను కొంతమంది చాలా కాలంగా వేధింపులకు గురి చేస్తున్నారని తెలిసింది. రంగు తక్కువగా ఉండటం వల్ల, చూసేందుకు బాగా లేకపోవడం వల్ల తోటి విద్యార్థులు అతనిని ర్యాగింగ్ చేసే వారని తెలిసింది.

Samantha is furious over the row that led to the death of a student after he was harassed with ragging

బాత్ రూమ్లో టాయిలెట్ నాకించి దారుణం
బాలుడు చనిపోవడానికి ముందు పలువురు విద్యార్థులు అతని బాత్రూంలోకి తీసుకువెళ్లి టాయిలెట్లు నాకించారని ఆపై ఫ్లాష్ ఆన్ చేసి తడిపారని అతని స్నేహితులు తెలిపారు. ఇక ఈ ఘటన నేపథ్యంలో మిహిర్ తల్లి అతని స్నేహితులు చెప్పిన విషయాలను డీజీపీతో సహా ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. తన కుమారుడి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కేరళ బాలుడి మృతిపై స్పందించిన సమంత
తాజాగా ఈ దారుణ ఘటన పైన సినీనటి సమంత స్పందించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని సమంత డిమాండ్ చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకొని తాను షాక్ కు గురైనట్టుగా ఆమె తెలిపారు. ఇది 2025 సంవత్సరం అయినప్పటికీ ద్వేషం, విషంతో నిండిన కొంతమంది వ్యక్తుల కారణంగా ఒక బాలుడు తన జీవితాన్ని కోల్పోయాడని హేళనగా చూడడం, ర్యాగింగ్ వంటివి చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తుందన్నారు.

కఠిన చర్యలకు సమంత డిమాండ్
మన దగ్గర కఠినమైన ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయని, అయినప్పటికీ తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబితే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలామంది విద్యార్థులు మౌనంగా బాధపడుతూ ఉంటున్నారని ఆమె పేర్కొన్నారు. మనం ఎక్కడ విఫలం అవుతున్నాం... ఈ ఘటన పైన సంతాపం తెలియజేయడమే కాదు కఠిన చర్యలు తీసుకోవాలని సమంత డిమాండ్ చేశారు. అధికారులు ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటున్నాను అని సమంత పేర్కొన్నారు.

ఆ విద్యార్థికి న్యాయం జరగాలన్న సమంత
అంతే కాదు నిజా నిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నానని, ఆ విద్యార్థికి న్యాయం జరగాలని సమంత తెలిపారు. ఎదుటివారి నుంచి బెదిరింపులు వేధింపులు అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి బయటకు మాట్లాడాలని, అలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్టుగా నిలవాలని సమంత తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+