Producer: డ్రగ్స్ కేసులో ఫేమస్ ప్రోడ్యూసర్ అరెస్టు, ఆ రోజు అదే నటి, ఈగ ఫేమ్ హీరో, సింగం !

బెంగళూరు: బెంగళూరు డ్రగ్స్ కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే స్యాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో ఫస్ట్ పార్ట్ పూర్తి చేసిన పోలీసులు ఇప్పుడు సెకండ్ పార్ట్ సినిమా మొదలుపెట్టారు. బాహుబలి సినిమా టైపులో డ్రగ్స్ కేసు వ్యవహారం ఎన్ని పార్ట్ లు ఉంటుందో అనే విషయం అంతుచిక్కడం లేదు. డ్రగ్స్ కేసులో ప్రముఖ నిర్మాత అరెస్టు కావడం కలకలం రేపింది. సింగం సినిమాను రీమేక్ చేసి హీరోతోనే డైరెక్షన్ చేయించి సూపర్ డూపర్ హిట్ చేయించిన ఆ సంచలన నిర్మాత ఇప్పుడు కటకటాలపాలైనాడు. ట్విస్ట్ ఏమిటంటే సింగం సినిమాలో ఈగ ఫేమ్ హీరో కావడం, ఇటీవల అరెస్టు అయిన ప్రముఖ నటి ఆ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఈగా ఫేమ్ సుదీప్ ఆల్ ఇన్ వన్

ఈగా ఫేమ్ సుదీప్ ఆల్ ఇన్ వన్

సంచలనాల దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్యాండిల్ వుడ్ టాప్ హీరో సుదీప్ ఈగ సినిమాలో విలన్ గా నటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. సుదీప్ హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

సింగం రీమేక్

సింగం రీమేక్


తమిళ హీరో సూర్యా నటించిన సింగం సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. తెలుగులో సింగం సినిమా డబ్బింగ్ కావడం, సూపర్ హిట్ అయ్యింది. కన్నడలో సుదీప్ హీరోగా సింగం సినిమాను రీమేక్ చేశారు. కన్నడ సింగం రీమేక్ కెంపేగౌడ సినిమాలో సుదీప్ హీరో. కెంపేగౌడ సినిమాలలో సుదీప్ హీరో మాత్రమే కాదు, ఆ సినిమాకు సుదీప్ దర్శకుడు

ఒక్కసినిమాతో శంకర్ ఫేమస్

ఒక్కసినిమాతో శంకర్ ఫేమస్


సింగం కన్నడ రీమేక్ కెంపేగౌడ సినిమాకు శంకర్ గౌడ నిర్మాత. నిజానికి హీరో సుదీప్ వీరాభిమాని అయిన శంకర్ గౌడ ఆ సినిమాలో హీరోగా సుదీప్ ను పెట్టడమే కాకుండా ఆయనతోనే దర్శకత్వం చేయించారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ సోదరుడు రవిశంకర్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటించాడు. 2011 మార్చి 11వ తేదీ విడుదలైన కెంపేగౌడ సినిమా ఊహించినదానికంటే కన్నడలో సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ సినిమా నిర్మాత శంకర్ గౌడ పేరు స్యాండిల్ వుడ్ లో మార్మోగిపోయింది.

డ్రగ్స్ కేసులో శంకర్ గౌడ ఢమాల్

డ్రగ్స్ కేసులో శంకర్ గౌడ ఢమాల్

బెంగళూరు డ్రగ్స్ కేసు వ్యవహారం ఇటీవల దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. బెంగళూరు డ్రగ్స్ కేసులో స్యాండిల్ వుడ్ టాప్ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గర్లాని అరెస్టు అయ్యి జైలుపాలై కొన్ని నెలల పాటు జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇదే డ్రగ్స్ కేసులో స్యాండిల్ వుడ్ ప్రముఖ నిర్మాత శంకర్ గౌడను బెంగళూరులోని గోవిందపురం పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.

సరిగ్గా 10 ఏళ్లకు శంకర్ కు బంపర్ ఆఫర్

సరిగ్గా 10 ఏళ్లకు శంకర్ కు బంపర్ ఆఫర్


2011 మార్చి నెల 11వ తేదీ కెంపేగౌడ సినిమా విడుదల కావడంతో ఆ సినిమా నిర్మాత శంకర్ గౌడ పేరు కర్ణాటకలో మార్మోగిపోయింది. విచిత్రం ఏమిటంటే సరిగ్గా 10 ఏళ్ల 13 రోజులు (2011-2021) తరువాత అదే మార్చి నెలలో శంకర్ గౌడ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం విశేషం. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే సింగం సినిమా కన్నడ రీమేక్ కెంపేగౌడ సినిమాలో హీరో సుదీప్ తో పాటు కొన్ని నెలల క్రితం డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన రాగిణి ద్వివేది హీరోయిన్ గా నటించింది. శంకర్ గౌడ దెబ్బతో ఇంకా ఎంత మంది డ్రగ్స్ కేసులో తెర మీదకు వస్తారో అనే విషయం అంతు చిక్కడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+