భారత్ ఉప్పు తిని..పాకిస్తాన్‌కు సపోర్ట్ చేస్తావా: సానియా మీర్జాను ఆడేసుకుంటోన్న నెటిజన్లు

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ 2021 టోర్నమెంట్ చిట్టచివరి దశకు వచ్చేసింది. ఫైనలిస్టులు ఎవరో తేలిపోయింది. ఈ దఫా ఈ ప్రతిష్ఠాత్మక కప్..ఆసియా ఉపఖండం చేజారి పోయింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఫైనల్ చేరాయి. సెమీ ఫైనల్స్‌లో ఈ రెండు జట్లు తమ ప్రత్యర్థులను చిత్తు చేశాయి. తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్.. ఇంగ్లాండ్‌పై ఘన విజయాన్ని సాధించగా.. రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ మట్టి కరిచింది.

Recommended Video

    PAK VS AUS : పాకిస్థాన్ కోసం తెగించిన Sania Mirza పౌరసత్వం రద్దు... డిమాండ్స్ || Oneindia Telugu

    తిరుగులేని ఆస్ట్రేలియా

    గురువారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్లు అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఓడిపోవడం ఖాయమనుకున్న దశ నుంచి అనూహ్యంగా పుంజుకున్నారు. పిడుగుల్లాంటి షాట్లతో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్లిన మ్యాచ్‌ను మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ లాగేసుకున్నారు. పాకిస్తాన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని కొట్టి అవల పడేశారు. ఇంకా ఒక ఓవర్ మిగిలివుండగానే.. 177 పరుగుల టార్గెట్‌ను అందుకున్నారు.

    ఓపెనర్ల దూకుడు..

    దుబాయ్ స్టేడియంలోతొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించింది. తన దూకుడును కొనసాగించింది. ప్రత్యర్థికి 176 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్..తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 71 పరుగులు జోడించారు. బాబర్ ఆజమ్ 34 బంతుల్లో అయిదు ఫోర్లతో 39 పరుగులు చేశాడు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

    ఫకర్ జమాన్..కమాల్

    మరో ఓపెనర్ రిజ్వాన్ 52 బంతుల్లో 67 రన్స్ బాదేశాడు. ఇందులో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఆ తరువాత వెంటవెంటనే ఆసిఫ్ అలీ, షోయబ్ మాలిక్ వికెట్లను కోల్పోయినప్పటికీ.. వన్‌డౌన్ బ్యాటర్ ఫకర్ జమాన్ పరుగుల ప్రవాహాన్ని పారించాడు. మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 32 బంతుల్లో 55 పరుగులు చేశాడు. దీనితో జట్టు స్కోర్ 176 పరుగులకు చేరింది. సీనియర్ బ్యాటర్ షోయబ్ మాలిక్ తన వైఫల్యాన్ని కొనసాగించాడు ఈ మ్యాచ్‌లో కూడా. ఒక్క పరుగుకే వెనుదిరిగాడు.

    ఓడిపోతుందనుకున్న దశ నుంచి

    భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. షహెన్‌ షా అఫ్రిది బౌలింగ్‌లో ఓపెనర్ ఆరోన్ ఫించ్ అవుట్ అయ్యాడు. ఎల్బీగా వెనుదిరిగాడు. ఎదుర్కొన్న తొలిబంతికే అవుట్ అయ్యాడు ఫించ్. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ మిఛెల్ మార్ష్ సహకారంతో డేవిడ్ వార్నర్ భారీ షాట్లు ఆడాడు. వార్నర్ మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 30 బంతుల్లో 49 పరుగులు చేశాడు. 12 పరుగుల తేడాతో వార్నర్, మార్ష్ అవుట్ కావడం, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ రెండంకెల స్కోర్‌ను కూడా అందుకోలేకపోవడంతో జట్టు ఓడిపోవడం ఖాయమైంది.

    సునామీ సృష్టించిన వేడ్..

    మ్యాచ్ ఓడిపోవడం ఖాయమనుకున్న దశలో క్రీజ్‌లోకి దిగిన టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్లు మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్.. మ్యాచ్ ఫలితాన్నే మార్చివేశారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ప్రత్యేకించి- వేడ్.. సునామీని సృష్టించాడు. 17 బంతుల్లో 41 పరుగులు చేశాడంటే.. అతని దూకుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లతో 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడతను. 19వ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సులను బాదాడు. షహీన్ షా అఫ్రిది వేసిన ఆ ఓవర్‌లో జట్టు విజయానికి కావాల్సిన 22 పరుగులను పిండుకున్నాడు. స్టోయినిస్ 39 బంతుల్లో 40 పరుగులు చేశాడు.

    ఇదంతా ఒక ఎత్తయితే..

    ఇదంతా ఒక ఎత్తయితే.. తన భర్త షోయబ్ మాలిక్ ఉన్న పాకిస్తాన్ జట్టును మద్దతు ఇవ్వడానికి భారత్ టెన్నిస్ స్టార్, హైదరాబాదీ సానియా మీర్జా.. దుబాయ్ స్టేడియంలో కనిపించడం మరో ఎత్తు. క్రికెటర్ల కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన చోట ఆమె తళుక్కున మెరిశారు. పాకిస్తాన్ సపోర్టర్‌గా నిలిచారు. పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో జోష్‌లో కనిపించారు. షోయబ్ మాలిక్ ఒక పరుగుకే అవుట్ కావడం సానియా మీర్జాను నిరాశకు గురి చేసినప్పటికీ.. టీమ్ భారీ స్కోర్ చేయడంతో వారికి ఛీర్స్ చేశారు.

    సానియా మీర్జాపై ఫ్యాన్స్ ఫైర్


    భారత్ తరఫున టెన్నిస్ మ్యాచ్‌లను ఆడుతూ.. పాకిస్తాన్ మద్దతురాలిగా స్టేడియంలో కనిపించడం పట్ల అభిమానులు ఆమెపై నిప్పులు కురిపిస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు ఆడిన ఏ ఒక్క మ్యాచ్‌కు కూడా అటెండ్ కాలేదామె. పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆప్ఘనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాలతో టీమిండియా లీగ్ దశలో మ్యాచ్‌లను ఆడింది. ఈ అయిదింట్లో ఏ ఒక్క మ్యాచ్‌కు కూడా సానియా మీర్జా రాలేదు. టీమిండియాకు సపోర్ట్‌ చేయనూలేదు. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కొన్న పాకిస్తాన్‌కు మద్దతురాలిగా స్టేడియంలో కనిపించడం పట్ల అభిమానులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు.

    నమక్ హరామ్..

    భారత్ ఉప్పుతిని పాకిస్తాన్‌కు సపోర్ట్ చేస్తోందంటూ నెటిజన్లు ఘాటు వ్యాఖ్యాలలో చెడుగుడు ఆడేస్తున్నారు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ నుంచి భారత్ వైదొలగినప్పటికీ.. పట్టించుకోకుండా తన భర్త ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న పాకిస్తాన్ కోసం దుబాయ్ వెళ్లిందంటూ మండిపడుతున్నారు. ఇకపై సానియా మీర్జా ఆడే టెన్నిస్ టోర్నమెంట్లను బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. సానియాకు పాకిస్తాన్ పౌరసత్వాన్ని ఇవ్వాలని, ఆమెను భారత పౌరురాలిగా గుర్తించొద్దంటూ విమర్శిస్తున్నారు. సానియాకు ఉన్న భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తోన్నారు నెటిజన్లు. అసలే టీమిండియా సెమీ ఫైనల్స్‌కు చేరకపోవడం పట్ల బాధ, ఆవేశంలో ఉన్న అభిమానులకు.. సానియా మీర్జా దుబాయ్ స్టేడియంలో పాకిస్తాన్ మద్దతురాలిగా కనిపించడం మరింత కోపానికి గురి చేసింది. వారి ఆగ్రహాన్ని నషాళానికి అంటేలా చేసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+