బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Santro Ravi: పోలీసు కొడుకు, చేసేది ఏం పని ?, రాష్ట్రాన్ని గడగడలాడించేశాడు, ఎవడు వీడు ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మైసూరు: స్యాంటో రవి, స్యాంటో రవి, స్యాంట్రో రవి, ఇదే ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్. స్యాంట్రో రవి ఎవరు ?, అతను ఏం చేశాడు ?, ఎలా అంత పేరు తెచ్చుకున్నాడు ? అని అమాయక ప్రజలు ఆలోచిస్తున్నారు. స్యాంట్రో రవి అసలు మ్యాటర్ మొత్తం బయటకు రావడంతో అందరూ బిత్తరపోయారు. స్యాంట్రో రవి కథ ఓ పెద్ద సినిమా తియ్యవచ్చని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. అయితే స్యాంట్రో వ్యవహారం రోజురోజుకు ఒకో మలుపు తిరుగుతోంది. ఏదో అనుకుంటే ఏదో జరిగిందని కొందరు అనుకుంటున్నారు. అయితే కిలాడీ స్యాంట్రో రవి మాత్రం చాలా కూల్ గా ఉన్నాడని తెలిసింది.

Wife: వదిన రొమాన్స్ సీన్ చూసిన మరిది, వదిన పక్కన అన్న కాదు, ప్రియుడు, ఒరేయ్, క్లైమాక్స్ లో ట్విస్ట్ !Wife: వదిన రొమాన్స్ సీన్ చూసిన మరిది, వదిన పక్కన అన్న కాదు, ప్రియుడు, ఒరేయ్, క్లైమాక్స్ లో ట్విస్ట్ !

 గుజరాత్ లో ?

గుజరాత్ లో ?

గుజరాత్‌లో స్యాంట్రీ రవి అరెస్టు అయ్యాడు. హైటెక్ వ్యభిచారం, అధికారుల బదిలీల రాకెట్ల వరకు అన్నింటిలోనూ ఆరి తేరిపోయిన హార్డ్‌కోర్ క్రిమినల్ స్యాంట్రో రవి అని వెలుగు చూసింది. పెళ్లిళ్లు చేస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని తదితర మాయమాటలతో చాలా మంది అమాయకులైన యువతులను వ్యభిచారం రొంపిలోకి స్యాంట్రో దింపుతున్నాడని పోలీసులు వెల్లడించారు.

 పోలీసు అధికారి కొడుకు

పోలీసు అధికారి కొడుకు

కెఎస్ మంజునాథ్ అలియాస్ స్యాంట్రో రవి మాండ్య జిల్లాకు చెందినవాడు. అతని తండ్రి ఎక్సైజ్ శాఖ అధికారి. మండ్యలో ఉన్నప్పుడే స్యాంట్రో రవి హైటెక్ వ్యభిచారం వ్యాపారం చేసేవాడు. తరువాత అతని కార్యకలాపాలను మైసూర్‌కు మార్చారు. మైసూర్, బెంగళూరు, మాండ్య తదితర ప్రాంతాల్లో 1995 నుంచి ఇప్పటి వరకు అతనిపై 22 కేసులు నమోదయ్యాయి. 2005లో బెంగళూరు పోలీసులకు పట్టుబడిన స్యాంట్రో రవి తరువాత జైలుకు వెళ్లాడు.

 మీకు ఏం కావాలో చెప్పండి

మీకు ఏం కావాలో చెప్పండి

స్యాంట్రో రవి మీద గూండా చట్టం కింద కేసు నమోదు చేశారు.

జైలులో ఉండగానే చాలా మంది నేరగాళ్లతో స్యాంట్రో రవి అందరితో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి, ఉద్యోగం, ఇతర కోరికలు, ప్రలోభాలకు గురిచేసి ఎందరో అమ్మాయిలను వ్యభిచారంలోకి నెట్టాడు. ఈ మధ్య కాలంలో స్యాంట్రో కారునే రవి అతని వ్యాపారానికి ఎక్కువగా వాడేవాడు. అందుకే రవికి స్యాంట్రో రవి అనే పేరు వచ్చిందని పోలీసు అధికారులు అంటున్నారు. స్యాంట్రో రవి మ్యాటర్ మొత్తం బయటకు లాగాలని కర్ణాటక పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.

 ఐఏఎస్, ఐపీఎస్, తరువాత ఎవరు ?

ఐఏఎస్, ఐపీఎస్, తరువాత ఎవరు ?

ఈ మధ్య కాలంలో కొందరు రాజకీయ నాయకులు మేము ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తామని, తరువాత ఎవరినైనా బదిలే చేసే సత్తా తనకు ఉందని స్యాంట్రో రవి అందరిని నమ్మిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటకలో బదిలీల వ్యాపారం సాగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బెంగళూరులోని కుమారకృప అతిథి గృహంలో నెలరోజులుగా ఉంటూ స్యాంట్రో రవి ఇలాంటి వ్యాపారం సాగిస్తున్నాడని ఆరోపణలు రావడంతో కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఇలాంటి దందాలతో స్యాంట్రో రవి కోట్లాది రూపాయలు సంపాదించాడని ఆరోపణలు ఉన్నాయి.

English summary
Santro Ravi Story People shocked to know the real story, from police son to political leader, how did he do it in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X