వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శరత్ కుమార్‌కు చేయిచ్చిన లీడర్స్ (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

చెన్నై: సినీ నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ నేతృత్వంలోని ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి (ఏఐఎస్ ఎంకే) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓ శాసన సభ్యుడితో పాటు పార్టీ కీలక నేతలు శరత్ కుమార్ కు హ్యాండ్ ఇచ్చి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి వేరే పార్టీలను ఆశ్రయించారు.

ఈ దెబ్బతో శరత్ కుమార్ షాక్ కు గురైనాడు. వెంటనే చెన్నై లోని టీ నగర్ లోని పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యవర్గంతో పాటు జిల్లా స్థాయి నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిని తామే బహిష్కరించామని తీర్మానించారు.

రాష్ట్ర పార్టీ కమిటి భేటీ అనంతరం శరత్ కుమార్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీని చీల్చేందుకు కుట్ర జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము (ఏఐఎస్ఎంకే) ఇప్పుడు కూడా అన్నాడీఎంకేతో నే ఉన్నామని శరత్ కుమార్ స్పష్టం చేశారు.

అన్నాడీఎంకేతో పయనిస్తున్నాం

అన్నాడీఎంకేతో పయనిస్తున్నాం

తాము ఇప్పటికీ అన్నాడీఎంతోనే ఉన్నామని, ఆపార్టీతోనే పయనిస్తున్నామని శరత్ కుమార్ వివరించారు.

పార్టీ తీర్మానం మేరకు

పార్టీ తీర్మానం మేరకు

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో కలిసి పని చెయ్యాలి అనే విషయం పార్టీ కార్యవర్గంతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని శరత్ కుమార్ అన్నారు.

2007లో ఏఐఎస్ఎంకే అవిర్భవించింది

2007లో ఏఐఎస్ఎంకే అవిర్భవించింది

సినీ నటుడు శరత్ కుమార్ నేతృత్వంలో 2007లో ఏఐఎస్ఎంకే పార్టీ అవిర్భవించింది. నాడర్ సామాజిక వర్గంతో ఈ పార్టీ నిండిఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పని చేసింది.

నారాయణ్ చేరిక

నారాయణ్ చేరిక

నాడర్ పేరవై నేత ఎర్పాపూర్ నారాయణన్ ఏఐఎస్ఎంకే పార్టీలో చేరారు. శరత్ కుమార్ తెన్ కాశి నుంచి, నారాయణన్ నాంగువేరి నియోజక వర్గాల నుంచి పోటీ చేసి శాసన సభ్యులుగా గెలుపోందారు.

రెండు ఆకుల గుర్తుతో

రెండు ఆకుల గుర్తుతో

ఏఐఎస్ఎంకే పార్టీ ఉన్నా శరత్ కుమార్, నారాయణన్ ఇద్దరూ అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండు ఆకుల గుర్తుతోనే పోటీ చేసి గెలుపోందారు. ఇప్పుడు వారిద్దరూ అన్నాడీఎంకే సభ్యులు.

శరత్ కుమార్ పవర్ పోయిందని

శరత్ కుమార్ పవర్ పోయిందని

ఇటీవల దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఎన్నికల్లో పోటీ చేసిన శరత్ కుమార్ ఓటమిపాలైనారు. అప్పటి నుంచి శరత్ కుమార్ అన్నాడీఎంకేకి దూరంగానే ఉంటున్నారు.

దెబ్బ మీద దెబ్బ

దెబ్బ మీద దెబ్బ

ఇదే సమయంలో ఎస్ఎంకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజన్, పార్టీ ప్రధాన కార్యాలయ కార్యదర్శి ఐస్ హౌస్ త్యాగులతో పాటు వందలాధి మంది పార్టీ కీలక నేతలు శరత్ కుమార్ కు హ్యాండ్ ఇచ్చారు.

బీజేపీ లోకి జంప్

బీజేపీ లోకి జంప్

శరత్ కుమార్ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకులు అందరూ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక మీదట బీజేపీలోనే ఉంటామని వారు అంటున్నారు.

శరత్ కుమార్ మారిపోయాడు

శరత్ కుమార్ మారిపోయాడు

శరత్ కుమార్ చాల మారిపోయాడని, అన్నాడీఎంకేకి రాజీనామా చెయ్యాలని ఒత్తిడి తీసుకు వస్తున్నాడని అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానని శాసన సభ్యుడు నారాయణన్ అంటున్నారు.

అన్నాడీఎంకేతోనే ఉంటాను

అన్నాడీఎంకేతోనే ఉంటాను

తాను అన్నాడీఎంకే పార్టీ రెండు ఆకుల గుర్తుతో గెలిచానని, ఇప్పటికీ ఆపార్టీతోనే ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి పోటీ చేస్తానని అంటున్నారు.

మారుతున్న తమిళనాడు రాజకీయాలు

మారుతున్న తమిళనాడు రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆరాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాకుండా పోతున్నదని రాజకీయ నిపుణులు అంటున్నారు.

English summary
Sarath Kumar and Narayanan contested on the ruling AIADMK’s symbol and were elected from Tenkasi and Nanguneri constituencies respectively to the Assembly in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X