24 గంటల్లో... పన్నీరు వెనుక ఎవరున్నారు: శశికళ, అచ్చం జయలా..

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పదవి పోయిన తర్వాత మాట మార్చారని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఘాటుగా స్పందించారు.

చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పదవి పోయిన తర్వాత మాట మార్చారని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఘాటుగా స్పందించారు. తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. పార్టీని ఎవరూ చీల్చలేరని వ్యాఖ్యానించారు.

రాజీనామా చేసిన తర్వాత, 48 గంటల్లోనే పన్నీరు సెల్వం మాట మార్చారని, ఆయన వెనుక ఎవరున్నారో తేలాలని వ్యాఖ్యానించారు. దీనిని ప్రజలు గమనించాలన్నారు. కాగా, పన్నీరు సెల్వం రాజీనామా చేసిన తర్వాత మాట మార్చారని శశికళతో భేటీ అయిన ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

Sasikala to address media shortly as she concludes meeting with MLAs

అచ్చం జయలలితలాగే.. ఎమ్మెల్యేలతో శశికళ భేటీ

అన్నాడీఎంకే హెడ్ క్వార్టర్‌కు పార్టీ అధినేత్రి శశికళ మధ్యాహ్నం చేరుకున్నారు. అచ్చం దివంగత జయలలితలాగే అభివాదం చేస్తూ కార్యాలయంలోకి వెళ్లారు. అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలతో ఆమె భేటీ అయ్యారు. ఈ భేటీకి 130 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

తమిళనాట ఇదీ బలం

తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుతం పన్నీర్‌సెల్వంతో కలిపి అన్నాడీఎంకేకు 134 మంది, డీఎంకేకు 89 మంది, కాంగ్రెస్‌కు 8 మంది, 2 స్థానాల్లో ఇతరులు ఉన్నారు. జయలలిత మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. పన్నీరు వైపు దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+