దినకరన్ తిక్క చేష్టలతోనే ఇంత జరిగింది: మన్నార్ గుడి మాఫియాకు శశికళ ఫుల్ క్లాస్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు/చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన 18 మంది ఎమ్మెల్యేల పదవులు కాపాడుకోవడంలో టీటీవీ దినకరన్, మన్నార్ గుడి మాఫియా నిర్లక్షం చేశారని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళ మండిపడ్డారని తెలిసింది.

తమిళనాడు స్పీకర్ ధనపాల్ 18 మంది ఎమ్మెల్యే మీద అనర్హత వేటు వేసేంత వరకు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని, వేటు పడకుండా స్టే ఎందుకు తెచ్చుకోలేదని శశశికళ తనను కలిసిన నాయకులను ప్రశ్నించారని సమాచారం.

Sasikala feels ttv Dinakaran failed to tackle the Rebel MLAs issue.

చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు అనర్హత వేటు పడిన తరువాత హైకోర్టును ఆశ్రయించిన టీటీవీ దినకరన్ మీద శశికళ తీవ్రస్థాయిలో మండిపడ్డారని ఆమె వర్గీయులు అంటున్నారు. ఎలాగైన ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని తాను ఎన్నిసార్లు చెప్పినా టీటీవీ దినకరన్ పట్టించుకోలేదని, అతని తిక్క చేష్టల కారణంగా అన్ని ప్లాన్ లు నాశనం అవుతున్నాయని శశికళ మండిపడ్డారని తెలిసింది. హైకోర్టులో మనకు అనుకూలంగా తీర్పురాకుంటే ఏం చెయ్యాలి అనే విషయంపై న్యాయనిపుణలతో చర్చించాలని శశికళ సూచించారని సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sources said that Sasikala who is serving Jail term feel Dinakaran was failed to tackle the Rebel MLAs disqualified issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి