సాధించిన శశికళ: బెంగళూరు జైల్లో చిన్నమ్మకు ఇవన్నీ ఓకే
బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు అధికారులను పదేపదే పీడించిన శశికళ చివరికి ఆమె అనుకున్నది సాధించారు. జైల్లోని గదిలో శశికళ కర్చోవడానికి ఒక కుర్చీ, టీవీ, టీవీ, ఫ్యాన్ ఏర్పాటు చేశారు.
బెంగుళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ కాస్త ఊపిరిపీల్చుకున్నారు. సాధారణ ఖైదీలా కాకుండా అధికారులు శశికళకు కొన్ని సదుపాయాలు కల్పించడంతో చిన్నమ్మ రిలాక్స్ అయ్యారు.
బెంగళూరు నగర సమీపంలోని పరప్పన అగ్రహార జైలుకు వెళ్లిన రోజు శశికళ తనకు ప్రత్యేక గది ఇవ్వాలని, ఇంటి భోజనం, టీవీ, మంచం, సహాయకురాలిని ఇవ్వాలని గొంతెమ్మ కోర్కెలు కోరిన విషయం తెలిసిందే. అయితే న్యాయమూర్తి అందుకు అంగీకరించలేదు.

పరప్పన అగ్రహార జైల్లో మహిళా ఖైదీలు ఉన్న బ్యారక్ మొదటి అంతస్తులో ఉన్న శశికళ సాదారణ ఖైదీలాగే శిక్ష అనుభవిస్తున్నారు. అయితే జైళ్ల శాఖ అధికారులకు శశికళ పదేపదే మనవి చెయ్యడంతో వారు కొద్దిగా కరుణించినట్లు ఉన్నారు.
శశికళ గదిలో కర్చోవడానికి ఒక కుర్చీ, టీవీ, టీవీ, ఫ్యాన్ ఏర్పాటు చేశారు. శశికళకు రానురాను జైల్లో అన్ని సదుపాయాలు కల్పించే అవకాశం ఉందని సమాచారం. అయితే శశికళ మనవి మేరకు అధికారులు టీవీ, ఫ్యాన్, కుర్చీ ఇచ్చారని తెలిసింది.












Click it and Unblock the Notifications