శశికళ నుంచి ఊహించని ట్విస్ట్.. 'సీఎం' అభ్యర్థిగా సెంగొట్టయన్!?
తనకు బదులుగా పార్టీ ఎమ్మెల్యే సెంగొట్టయన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
చెన్నై: తమిళ రాజకీయాలు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్ చేస్తోన్న జాప్యం పట్ల తీవ్ర అసహనంతో ఉన్న శశికళ.. తన ఎమ్మెల్యేలతో నేరుగా రాజ్ భవన్ వెళ్లి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి.
ఇదే సమయంలో మరో ఊహించని ట్విస్ట్ సైతం తెరపైకి రావడం ప్రతీ ఒక్కరిని నోరెళ్లబెట్టేలా చేస్తోంది. తనపై పెరుగుతోన్న వ్యతిరేకతకు చెక్ పెట్టడం.. పన్నీర్ సెల్వం సీఎం కాకుండా అడ్డుపడటం కోసం.. శశికళ తన రూట్ మార్చుకున్నట్టుగా తెలుస్తోంది.

తనకు బదులుగా పార్టీ ఎమ్మెల్యే సెంగొట్టయన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రజా వ్యతిరేకతను, పన్నీర్ తో పోరును ఈ కొత్త ప్రతిపాదనతో ఎదుర్కోవచ్చని శశికళ భావిస్తున్నారు. అయితే ఇదంతా ఊహాగానాలకే పరిమితమవుతుందా? లేక నిజంగానే శశికళ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications