పార్టీ చీఫ్ పదవిపై కత్తి: చిన్నమ్మ శశికళకు మరో షాక్
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు మరో షాక్. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న శశికళకు ఎన్నికల సంఘం కూడా షాకిచ్చింది.
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు మరో షాక్. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న శశికళకు ఎన్నికల సంఘం కూడా షాకిచ్చింది.
అన్నాడీఎంకే అధినేత్రి పదవిని శశికళ చేపట్టడంపై ఆమె వ్యతిరేకులు ఈసీకి లేఖ రాశారు. దీనిని ఎన్నికల సంఘం విచారించనుంది. విచారణ అనంతరం ఆమెకు పదవి ఉంటుందా లేదా అనేది తేలుతుంది.
పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని జాతీయ ఎన్నికల సంఘాన్ని పన్నీరు సెల్వం తరఫున ఎంపీ మైత్రేయన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. పార్టీ పరంగా శశికళ, ఆమె తనయుడు దినకరన్ ఎన్నిక చెల్లదని ఫిర్యాదు చేశారు.

కాగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామిని నియమించడం పట్ల ఆ పార్టీ ఎంపీ, లోకసభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై హర్షం వ్యక్తం చేశారు.
ఇది ప్రజా విజయమని, గవర్నర్ నిర్ణయంతో ధర్మమే విజయం సాధించదన్నారు. పన్నీరు సెల్వంతో తమకు సమస్య లేదని, ఆయన పార్టీలో లేరన్నారు. రాబోయే రోజుల్లో అమ్మ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.












Click it and Unblock the Notifications