పార్టీ అధినేత్రిగా నా ఎన్నిక ఇలా: ఈసికి శశికళ వివరణ
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా తనను ఎన్నుకోవడంపై శశికళ శుక్రవారం నాడు ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చారు. పదవి కోసం ఎక్కడా పార్టీ నియమావళిని ఉల్లంఘించలేదని పేర్కొన్నారు.
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా తనను ఎన్నుకోవడంపై శశికళ శుక్రవారం నాడు ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చారు. పదవి కోసం ఎక్కడా పార్టీ నియమావళిని ఉల్లంఘించలేదని పేర్కొన్నారు.
పార్టీ నియమావళిని తాను ఉల్లంఘించలేదని, నిబంధనల ప్రకారమే తాను ఎన్నికయ్యానని ఆమె తెలిపారు. తొలుత శశికళ తరఫున పార్టీ వివరణ ఇచ్చింది. దీనిపై ఈసీ సంతృప్తి చెందకపోవడంతో శశికళ మరోసారి వివరణ ఇచ్చారు.

మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, ఆయన వర్గం అన్నాడీఎంకే ఎంపీ మైత్రేయన్, ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ నియమనిబంధనలకు విరుద్ధంగా శశికళ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారని వారు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు శశికళకు ఈసీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆమె వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications