వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: 'నేను సర్వీస్‌రూల్స్‌ను ఉల్లంఘించలేదు', 'విచారణకు కర్ణాటక సీఎం ఆదేశం'

తాను ఎలాంటి తప్పు చేయలేదని తనను టార్గెట్ చేయడం సరైంది కాదని జైళ్ళ డీఐజీ రూప మౌర్గిల్ అన్నారు. పరప్పర ఆగ్రహర జైలులో శశికళకు రాచమర్యాదలు జరుగుతున్న విషయమై తాను ఇచ్చిన నివేదికకు కట్టుబడి ఉన్నానని.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: తాను ఎలాంటి తప్పు చేయలేదని తనను టార్గెట్ చేయడం సరైంది కాదని జైళ్ళ డీఐజీ రూప మౌర్గిల్ అన్నారు. పరప్పర ఆగ్రహర జైలులో శశికళకు రాచమర్యాదలు జరుగుతున్న విషయమై తాను ఇచ్చిన నివేదికకు కట్టుబడి ఉన్నానని ఆమె మరోసారి ప్రకటించారు.

శుక్రవారంనాడు ఆమె మీడియాతో మాట్లాడారు.తాను ఎక్కడా కూడ ప్రోటోకాల్ ఉల్లంఘించలేదన్నారు. డీఐజీ రూప ప్రకటించారు. సర్వీస్‌రూల్స్ అందరికీ వర్తించాలన్నారు. తనకే కాదన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘిస్తే అందరిపై చర్యలు తీసుకోవాలని రూప వ్యాఖ్యానించారు.

 Sasikala's VIP treatment: Targeting me is unfair, didn't break service rules, says D Roopa

జైళ్ళశాఖ డిఐజీగా తాను గత నెల 23వ, తేదిన బాధ్యతలను స్వీకరించాను. విధుల్లో భాగంగా ఈ నెల 10న, తాను పరప్పర జైలుకు వెళ్ళాను. ఆ తర్వాతి రోజే డిజిపి కార్యాలయం నుండి మోమో వచ్చింది. అందులో పరప్పర ఆగ్రహర జైలుకు ఎవరు వెళ్ళమన్నారని ప్రశ్నించారు.

తన అధికారపరిధి ప్రకారం జైళ్ళకు వెళ్ళి తనిఖీ చేయడం తప్పు చేసి సిబ్బంది నుండి వివరణ కోరడం కూడ తన విధేనని చెప్పారు. తన విధిని సక్రమంగా నిర్వర్థిస్తోంటే మోమో జారీ చేయడం అత్యంత శోచనీయమన్నారు.

ఈ ఘటనపై సమగ్రవిచారణ జరిపిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు. జైళ్ళ డిఐజీ రూప సర్వీస్‌రూల్స్‌కు వ్యతిరేకంగా డిజిపి సత్యనారాయణకు వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదన్నారు. ఈ విషయమై హోంశాఖ కార్యదర్శితో చర్చించి విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తామన్నారు.

పనిచేసిన ప్రతిచోట రూప మంచిపేరు తెచ్చుకొన్నారు. 2000లో సివిల్స్‌లో 43వ, ర్యాంక్ సాధించి ఐపీఎస్‌ను ఎంచుకొన్నారు. ఫార్ప్‌షూటర్‌గా తెచ్చుకొన్నారు.ఆ బ్యాచ్‌లో ఆమె 5వ, స్థానంలో నిలిచారు. ఓ కేసులో అప్పటి మధ్యప్రదేశ్ సీఎం ఉమాభారతిని ఎస్‌పి హోదాలో ఆమె అరెస్టు చేశారు.

English summary
D Roopa Moudgil, DIG (Prisons) of Karnataka, who exposed the VIP treatment being given to AIADMK leader VK Sasikala, on Friday alleged that she was being singled out by the state government for doing her job.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X