శశికలకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ: చిన్నమ్మ బెంగళూరు సెంట్రల్ జైల్లోనే ఉండాలి
శశికళ అండ్ కోకు సుప్రీం కోర్టులో చుక్కెదురు ఇక చిన్నమ్మకు బెంగళూరు సెంట్రల్ జైలే గతి మాన్నార్ గుడి మాఫియా ప్రయత్నాలు విఫలం
న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో నాలుగు సంవత్సరాలు జైలు శిక్షకు గురైన వీకే శశికళ నటరాజన్ తనకు విధించిన శిక్షను మళ్లీ పరిశీలించి కేసు నుంచి విముక్తి చెయ్యాలని సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు. బుధవారం శశికళ అర్జీ విచారణకు వచ్చింది.
కేసు వివరాలు తెలుసుకున్న న్యాయస్థానం శశికళ అర్జీని విచారణకు స్వీకరించడానికి తిరస్కరించింది. నాలుగు సంవత్సరాలు శశికళ, ఆమె వదిన ఇళవరసి, సుధాకరన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించాలని ముందు ఇచ్చిన కోర్టు తీర్పుతో సుప్రీం కోర్టు ఏకీభవించింది.

అక్రమాస్తుల కేసులో ఏ-1గా ఉన్న జయలలిత మరణించారని, ఆమె లేని సమయంలో అనవసరంగా కేసులో చిక్కుకున్న మాకు శిక్ష వేశారని, తమకు శిక్ష నుంచి విముక్తి కల్పించాలని శశికళ, ఇళవరసి, సుధాకరన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. శశికళను జైల్లో నుంచి బయటకు తీసుకురావాలని ఆమె భర్త నటరాజన్ తో పాటు మన్నార్ గుడి మాఫియా విఫలయత్నం చేసింది. చివరికి సుప్రీం కోర్టులో శశికళ అండ్ కోకు చుక్కెదురైయ్యింది.












Click it and Unblock the Notifications