శశికళ ఎఫెక్ట్: స్టాలిన్‌కు చేదు అనుభవం, పన్నీరు కోసం వేచి చూసి మరీ..
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం - డీఎంకే అధినేత స్టాలిన్‌లు సచివాలయంలో భేటీ అవుతున్నారు. తమిళనాడులో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష ముఖ్య నేతల భేటీ చర్చకు దారి తీసింది.
చెన్నై: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కోసం డీఎంకే అధినేత స్టాలిన్ సోమవారం నాడు సచివాలయంలో పదిహేను నిమిషాలు వేచి చూసి వెళ్లిపోయారు. పన్నీరు కోసం ఆయన వచ్చారు. కానీ స్టాలిన్‌కు చేదు అనుభవం ఎదురైంది. స్టాలిన్ వెళ్లిన కాసేపటికి పన్నీరు రావడం గమనార్హం.
పన్నీరు సెల్వం ఎందుకు రాలేదు? వైరి పక్షంతో పన్నీరు కలుస్తున్నాడని శశికళ ఆరోపించిన నేపథ్యంలో ఆ మచ్చ పడకుండా ఉండేందుకు రాలేదా? మరేదైనా కారణం ఉందా అనే చర్చ సాగుతోంది.
అంతకుముందు... ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం - డీఎంకే అధినేత స్టాలిన్‌లు సచివాలయంలో భేటీ కావాలని భావించారు. తమిళనాడులో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష ముఖ్య నేతల భేటీ చర్చకు దారి తీసింది.

తమిళనాడు కోసం అంశాల వారిగా పన్నీరుకు మద్దతిచ్చేందుకు తాము సిద్ధమని స్టాలిన్ ప్రకటించారు. మరోవైపు, శశికళను ఇటు స్టాలిన్, అటు పన్నీరు సెల్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో వీరి మధ్య చర్చ జరిగింది.
సచివాలయంలో వీరి మధ్య భేటీ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పన్నీరు కంటే ముందే స్టాలిన్ సచివాలయానికి చేరుకుున్నారు. స్టాలిన్ - పన్నీరుల భేటీ నేపథ్యంలో తమిళనాట రాజకీయాల తారుమారు అవుతున్నాయని చర్చ సాగింది.
డిఎంకే - అన్నాడీఎంకేలు ఇక్కడ దశాబ్దాలుగా వైరి పక్షాలు. ఇప్పుడు శశికళ ఎంట్రీతో దశాబ్దాల తర్వాత ఇరు పార్టీల నేతలు మాట్లాడుకుంటున్నారు. శశికళకు చెక్ పెట్టేందుకు స్టాలిన్.. పన్నీరుకు మద్దతిస్తారా అనే చర్చ సాగుతోంది.
తొలిసారి సచివాలయానికి పన్నీరు
పన్నీర్ సోమవారం మధ్యాహ్నం సచివాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత పన్నీర్ సెల్వం సచివాలయానికి రావడం ఇది తొలిసారి. రాష్ట్రంలో పాలన సక్రమంగానే ఉందని సంకేతాలిచ్చేందుకు పన్నీర్ సచివాలయానికి వచ్చారని సమాచారం. ఈ సందర్భంగా జయలలిత నివాసం వేద నిలయాన్ని స్మారకంగా మార్చేందుకు గల అవకాశాలపై ఆయన అధికారులతో చర్చించనున్నారు. సీఎస్ గిరిజా వైద్యనాధన్‌తో ఆయన భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications