డీఆర్‌డీఓ నూతన ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి సతీష్ రెడ్డి నియామకం
న్యూఢిల్లీ: రక్షణ శాఖలో కీలకమైన రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఛైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డా. సతీశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది.
నెల్లూరు జిల్లాకు చెందిన సతీశ్‌రెడ్డి ప్రస్తుతం రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు హోదాలో ఉన్నారు. అంతకుముందు హైదరాబాద్ డీఆర్‌డీవోలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌కు డెరైక్టర్‌గా ఉన్నారు.

మనోహర్ పారికర్ రక్షణ మంత్రిగా వ్యవహరిస్తున్న సమయంలో సలహాదారుగా నియమితులయ్యారు. అనంతపురంలో బీటెక్, జేఎన్‌టీయూహెచ్‌లో ఎంఎస్ పూర్తి చేసిన సతీశ్‌రెడ్డి.. 1985లో డీఆర్‌డీవోలో చేరారు. నావిగేషన్, ఏవియానిక్స్ టెక్నాలజీ రంగాల్లో విశేషమైన పరిశోధనలు చేశారు సతీష్ రెడ్డి.
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నుంచి హోమీ జహంగీర్ బాబా స్మారక అవార్డు, స్వావలంభన పరిశోధనకు ప్రధాని నుంచి అవార్డు తదితర సత్కారాలను అందుకున్నారు. జూన్‌లో ఎస్ క్రిస్టోఫర్ రిటైరైన నేపథ్యంలో సతీష్ రెడ్డి డీఆర్డీఓ ఛైర్మన్ స్థానంలో నియామకమయ్యారు.
-
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
సాయిరెడ్డి తాజా సంకేతాలు, తెర వెనుక..!? -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దెబ్బ ఏపీ రోడ్లకు.. ఎలాగంటే -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !! -
జగన్ కు 'మావిగన్' సలహా ఆయనదే, అసలు టార్గెట్..!! -
ఏపీలో ఆ జిల్లాలు హాట్ స్పాట్స్- అత్యధిక ఉష్ణోగ్రత -
ఆ విషయంలో ఎవరిమాట వినొద్దు అని కలెక్టర్ లకు సీఎం చంద్రబాబు ఆదేశం! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే..












Click it and Unblock the Notifications