రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు సీజేఐ చిత్తమే.. ప్రత్యేక విధానాలే లేవు
న్యూఢిల్లీ: గతవారం రాజ్యాంగ ధర్మాసనాల ఏర్పాటు, వాటికి కేసుల కేటాయింపు విషయమై సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తికి, నలుగురు సీనియర్ న్యాయమూర్తులకు మధ్య తలెత్తిన వివాదం ఇంకా పరిష్క్రుతం కాలేదు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనాలకు ఎంపిక చేసిన కేసులు అప్పగించారని జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గగోయి, జస్టిస్ కురియన్ జోసెఫ్, ఎంబీ లోకూర్ బహిరంగంగా విమర్శించిన సంగతి తెలిసిందే.
Recommended Video

అసలు సుప్రీంకోర్టులో కేసుల కేటాయింపు విధానం తీరు తెన్నులెలా ఉంటాయి? సుప్రీంకోర్టుకు ఆ మాటకు వస్తే దేశమంతటికీ చీఫ్ జస్టిస్ చాలా కీలకం. అటువంటప్పుడు చీఫ్ జస్టిస్ కేసుల కేటాయించే విషయమై ఎంచుకునే ప్రాతిపదిక ఒకసారి పరిశీలిద్దాం.

గుర్తింపు కోసం న్యాయమూర్తులు పాకులాడనేలేదు
ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో సున్నితమైన అంశాలతోపాటు ప్రధాన అంశాలపై రాజ్యాంగ ధర్మాసనాల ఏర్పాటుకు అధికారికంగా ఎటువంటి మార్గదర్శకాలు, విధానాలు లేవనే తెలుస్తున్నది. ఈ విషయాన్ని ఇంతకుముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పని చేసి రిటైరైన ప్రముఖులు తేల్చేశారు. చీఫ్ జస్టిస్‌లు గానీ, న్యాయమూర్తులు గానీ తమకు తాము గుర్తింపు కోసం పాకులాడిన ఘటనలు లేవని అంటున్నారు.

విస్త్రుత ప్రాతిపదికన 47 విభాగాలకు కేసులు కేటాయింపు
ఒక కేసు నమోదైన తర్వాత ఆ కేసు వివరాలను సవివరంగా పరిశీలించాకే సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ పరిశీలిస్తుంది. ఆ కేసుకు సంబంధించిన పత్రాలను అమూలాగ్రం పరిశీలించాక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వర్గీకరించిన తర్వాత ఆయా కేసులను సంబంధిత ధర్మాసనాలకు కేటాయిస్తారు. దీనికి విస్త్ర్రుత ప్రాతిపదికన 47 విభాగాలు ఉన్నాయి. లెటర్ పిటిషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం, పన్ను, సేవ విభాగాలు, క్రిమినల్ అప్పీళ్లు ఉన్నాయి. ఒక్కో క్యాటగిరీలో రకరకాల సబ్ క్యాటగిరీలు ఉన్నాయి. ఒక్కో విభాగానికి ఒక్క కేసు మించి కేటాయించకూడదు. రోస్టర్ ప్రకారమే కేసుల కేటాయింపులు జరుగుతాయి.

రోస్టర్ పద్దతి ప్రకారం బెంచ్‌ల ఏర్పాటు
ప్రస్తుత కంప్యూటర్ యుగంలో న్యాయస్థానంలో నమోదైన ప్రతి కేసు ఏ బెంచ్‌కు కేటాయించబడుతుందో వెంటనే ఆన్‌లైన్‌లో నిర్దేశితం అవుతుంది. ఉదాహరణకు ఒక క్రిమినల్ కేసు సుప్రీంకోర్టుకు వస్తే దానికి సంబంధించిన ప్రార్థనలు, మార్కుల ఆధారంగానూ, రోస్టర్ పద్దతి ప్రకారం.. విచారించాల్సిన ధర్మాసనం ఖరారవుతున్నది. ఒకవేళ క్రిమినల్ కేసుల విచారణకు ఉదాహరణకు మూడు ధర్మాసనాలకు రోస్టర్ ప్రకారం కేటాయింపులు జరుగుతాయి. క్రిమినల్ కేసులను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తర్వాతీ స్థానంలో ఉన్న న్యాయమూర్తులు, అతి సున్నితమైన కేసులను కూడా విచారిస్తారు.

సీజేఐ ఆదేశాల మేరకే విస్త్రుత ధర్మాసనం ఏర్పాటు
అతి సున్నితమైన, ముఖ్యమైన కేసుల విచారణను తమలో ఏ ఒక్కరికీ అప్పగించలేదని నలుగురు సీనియర్ న్యాయమూర్తుల ఫిర్యాదుల్లో ఒకటి. వాటిని జూనియర్ న్యాయమూర్తుల సారథ్యంలోని బెంచ్‌లకు అప్పగిస్తున్నారని ఆక్షేపణ. బెంచ్‌ల ఏర్పాటు రెండు రకాలు. ఇద్దరు న్యాయమూర్తులతో ఒక బెంచ్ ఏర్పాటవుతుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు, అవసరమైనప్పుడు మాత్రమే విస్త్రుత బెంచ్ ల ఏర్పాటు జరుగుతుంది.

రోస్టర్ ప్రాతిపదికన బెంచ్‌ల కేటాయింపు
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) ప్రత్యేకించి ఒక బెంచ్‌కు మాత్రమే కేటాయిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీచేసే అధికారం ఉన్నది. సీజేఐ మాస్టర్ రోల్ పోషిస్తారు. దాని ప్రకారం సున్నితమైన కేసుల విచారణకు బెంచ్‌ల ఏర్పాటు అన్నది ఆయా అంశాల ప్రాతిపదికగా తప్ప మధ్యవర్తిత్వ ప్రాతిపదికన కాదన్నది నిర్వివాదాంశం. అలాగే సుప్రీంకోర్టు అధిపతిగా చీఫ్ జస్టిస్‌కు బెంచ్‌ల ఏర్పాటు, కేసుల కేటాయింపుపై విచక్షణాధికారాలు ఉంటాయి. సంబంధిత కేసు సున్నితమైందని ముందే సీజేఐ చెప్పితే రిజిస్ట్రార్ కూడా ఆయన నిర్ణయానికే వదిలేస్తారు.

హడావుడిగా మెడికల్ కేసులో రాజ్యాంగ ధర్మాసనం
సంప్రదాయం ప్రకారం సీజేఐ ముందస్తుగా సంబంధిత బెంచ్ లోని సీనియర్ న్యాయమూర్తులకు ఈ సంగతి తెలియజేస్తారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుపై నమోదైన కేసు విచారణపై ఇటీవల హడావుడిగా సీజేఐ.. రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయడం ఈ గందరగోళానికి తావిచ్చింది. రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సీనియర్ న్యాయమూర్తి సారథ్యం వహించాల్సి ఉంటుంది.

నజీర్ సారథ్యంలో విస్త్రుత ధర్మాసనాల ఏర్పాటు
ఆయా రాజ్యాంగ ధర్మాసనాల్లో సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎస్ ఏ బోబ్డేలకు చోటు కల్పించిన దాఖలాలు లేవు. ఆధార్ అంశంపై ఏర్పాటైన ధర్మాసనానికి వీరిని పరిశీలనకు తీసుకోలేదు. వీరిద్దరికి బదులు జస్టిస్ ఎస్ నజీర్ సారథ్యంలో విస్త్రుత ధర్మాసనాలు ఏర్పాటు చేశారు. దీనిపై స్పందించడానికి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నిరాకరించారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications