విద్వేషప్రసంగాలపై కేసులు పెట్టండి-ఫిర్యాదుల్లేకపోయినా-రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు..
దేశవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న విద్వేష ప్రసంగాలు,వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలోనే విద్వేష వ్యాఖ్యలు, ప్రసంగాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా రాష్ట్రాలు, కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఇకపై ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. అంతే కాదు ఫిర్యాదులతో సంబంధం లేకుండా కేసులు నమోదు చేయాలని కూడా సూచించింది.
ద్వేషపూరిత ప్రసంగాల కేసులపై స్వచ్ఛందంగా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీసులను ఆదేశిస్తూ గతేడాది జారీ చేసిన ఉత్తర్వుల పరిధిని సుప్రీంకోర్టు ఇవాళ పొడిగించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను విద్వేషంపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా ప్రసంగాలపై కేసుల నమోదులో జాప్యం చేస్తే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించింది.దీనిని తీవ్రమైన నేరంగా పేర్కొంటూ అత్యున్నత న్యాయస్థానం ద్వేషపూరిత ప్రసంగం దేశంలోని లౌకిక స్వరూపాన్ని ప్రభావితం చేసే అవకాశముందని పేర్కొంది.

దేశంలో ద్వేషపూరిత ప్రసంగాల నేరాలపై దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సుదీర్ఘంగా విచారించింది. ద్వేషపూరిత ప్రసంగాలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపిస్తూ దాఖలైన ధిక్కార పిటిషన్‌పై సుప్రీం బెంచ్ ఇంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన కోరింది. ప్రసంగకర్త మతంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. తద్వారా రాజ్యాంగం ప్రవేశిక ద్వారా ఉద్దేశించిన భారతదేశం యొక్క లౌకిక స్వభావం పరిరక్షించబడుతుందని న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఇవాళ తెలిపింది.
విద్వేష వ్యాఖ్యల్ని గుర్తించి చర్యలు తీసుకునేందుకు వీలుగా.. ప్రతి రాష్ట్రానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని పిటిషనర్లు సిఫార్సు చేయగా.. ప్రతి జిల్లాకు ఒకరిని బెంచ్ సూచించింది. సోషల్ మీడియా నుండి ద్వేషపూరిత ప్రసంగాలను ఉపసంహరించుకోవడానికి ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. న్యాయమూర్తులు రాజకీయ రహితులు, పార్టీ A లేదా పార్టీ Bతో సంబంధం కలిగి ఉండరని, వారి మనస్సులో ఉన్న ఏకైక విషయం భారత రాజ్యాంగం అని బెంచ్ పేర్కొంది.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications