వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సహారా గ్రూప్ కు షాక్ :రూ.39 వేల కోట్ల ఆస్తుల జప్తుకు సుప్రీం కోర్టు ఆదేశం

సహరా గ్రూప్ కు చెందిన రూ.39 వేల కోట్ల ఆస్తులను అటాచ్ చేయాలని సుప్రీంకోర్టు ఇవాళ ధేశించింది. మహారాష్ట్రలోని పూణెలో ఉన్న అంబే వాలీలోని ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: సహారా గ్రూప్ కు చెందిన రూ.39 వేల కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మహరాష్ట్రలోని పూణెలో ఉన్న అంబే వాలీలో ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశించింది.

సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ ఇంకా చెల్లించాల్సిన రూ.14,779 కోట్ల డబ్బు కోసం ఇలా చేయడం అనవసరమని కోర్టు అభిప్రాయపడింది.
పిభ్రవరి 20వ, తేది నాటికి సమస్యాత్మకంగా లేని ఆస్తుల జాబితా అందజేయాలని కోర్టు సహరా గ్రూప్ ఆదేశించింది. సహారా చెల్లించాల్సిన మిగతా డబ్బు కోసం ఈ ఆస్తులను వేలం వేయాలని కోర్టు సూచించింది.

 SC orders to attach Sahara's Aamby Valley

సెబీకి రూ.14,779 కోట్లు చెల్లించడానికి సహరా 2018 జూలై వరకు గడువు కోరింది. డబ్బు తిరిగి చెల్లించడం కోసం గతంలో కోర్టు ఇచ్చిన విధి విధానాల్లో గా ఈ రోజు సెబీకి సహరా గ్రూప్ రూ.600 కోట్లు చెల్లించింది.

అయినా 2019 జై వరకు గడువు సుదీర్ఘ సమయమని భావించిన నేపథ్యంలోనే ఆస్తుల వేలం వేయాలని కోరుతున్నట్టు తెలిపింది.తదుపరి విచారణను ఫిబ్రవరి 20వ, తేదికి వాయిదా వేసింది.

మరో వైపు సహరా చీఫ్ సుబ్రతారాయ్ పెరోల్ ను మరోసారి పొడిగించింది. ఆయన గత ఏడాది మే నుండి పెరోల్ పై బయటే ఉన్నారు.

English summary
Unhappy with Sahara's "roadmap" to repay duped investors by July 2019, the Supreme Court attached the group's jewel-in-the-crown standalone real estate asset in Maharashtra — Aamby Valley property — as a foolproof measure to ensure the recovery of money it owes investors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X