ముస్లింలు ఉండే ప్రాంతాన్ని పాకిస్తాన్ అన్న కర్నాటక హైకోర్టు జడ్జి-సుప్రీంకోర్టు ఆగ్రహం..!
కర్నాటక హైకోర్టులో ఓ న్యాయమూర్తి బెంగళూరులోని ముస్లింల ప్రాబల్యం ఉన్న ఓ ప్రాంతాన్ని ఉద్దేశించి పాకిస్తాన్ అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో జడ్జి స్ధానంలో ఉన్న ఆయన.. మతపరమైన వ్యాఖ్యలు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. కర్నాటక హైకోర్టు జడ్డి వ్యాఖ్యల వీడియోల్ని పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కర్నాటక హైకోర్టు జడ్జి చేసిన పాకిస్తాన్ వ్యాఖ్యలపై ఇవాళ సుప్రీంకోర్టులో సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల ధర్మాసనం విచారణ జరిపింది. కర్నాటక హైకోర్టు జడ్జి వేదవ్య సచ్చార్ శ్రీషానంద ఓ కేసు విచారణ సందర్భంగా బెంగళూరులోని ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని ఉద్దేశించి పాకిస్తాన అంటూ సంబోధించడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. జడ్జీలకు తాజాగా మరో ప్రవర్తనా నియామావళి రూపొందించాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించింది.

కర్నాటక హైకోర్టు జడ్డి వ్యాఖ్యలపై పూర్తి వివరాలు తీసుకోవాలని ఏజీతో పాటు సొలిసిటర్ జనరల్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అలాగే దీనిపై సుప్రీంకోర్టుకు రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను కూడా కోరింది. రాజ్యాంగ న్యాయమూర్తులు కోర్టులో చేసే వ్యాఖ్యలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్బంగా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. కోర్ట్‌రూమ్ ప్రొసీడింగ్స్‌ను పర్యవేక్షించడంలో , విస్తరించడంలో సోషల్ మీడియా చురుకైన పాత్ర పోషిస్తుందని, కాబట్టి కోర్టుల వ్యాఖ్యలు జనం వారి నుంచి కోరుకుంటున్న న్యాయానికి అనుగుణంగా ఉండాలని వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications