అర్జెంట్ లేదు: రాహుల్ గాంధీ పౌరసత్వంపై సుప్రీం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం)ను తక్షణమే విచారించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. అంత అత్యవసరంగా ఈ పిల్ విచారించలేమని తేల్చి చెప్పింది.

మంగళవారం పిల్ విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్. దత్తు నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రముఖ న్యాయవాది మనోహర్ లాల్ శర్మ ఈ విషయం సుప్రీం కోర్టులో పిల్ వేశారు.

 SC Refuses Urgent Hearing on Rahul Gandhi’ Citizenship row

రాహుల్ గాంధీ పౌరసత్వ వివాదంలో ఆయన మీద కేసు నమోదు చేసేలా సీబీఐకి ఆదేశాలు జారీ చెయ్యాలని, దర్యాప్తు నివేదిక నేరుగా సుప్రీం కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చెయ్యాలని న్యాయవాది మనోహర్ లాల్ శర్మ సుప్రీం కోర్టులో పిల్ వేశారు.

రాహుల్ గాంధీ తనకు ఉన్న బ్రిటన్ పౌరసత్వాన్ని దాచి పెట్టి, భారత్ లో ఎన్నికలలో పోటి చేసి ఎన్నికల ప్రక్రియను ఆపహాస్యం చేశారని ఆయన ఆరోపించారు. వెంటనే ఈ విషయంపై తక్షణ విచారణ చేపట్టాలని మంగళవారం కోర్టులో మనవి చేశారు. అయితే సుప్రీం కోర్టు తక్షణ విచారణకు నిరాకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+