Supreme Court : సుప్రీంకోర్టు కొత్త రోస్టర్ విడుదల- ఇకపై ఏ కేసు విచారణ ఎవరికి ?
సుప్రీంకోర్టులో ఏయే కేసుల విచారణ ఎవరు చేపట్టాలనే అంశంపై ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కొత్త రోస్టర్ విడుదల చేశారు. దీని ప్రకారం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను (పిల్) భారత ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు సోమవారం విచారించబోతున్నారు. సీజేఐ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్, సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్‌లు ఈ వాజ్యాలు విచారించనున్నాయి.
సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం తాజా కేసులకు సంబంధించిన రోస్టర్ జూలై 3 నుంచి అమల్లోకి రాబోతోంది. సీజేఐ ధర్మాసనం సామాజిక న్యాయపరమైన అంశాలు, లేఖల పిటిషన్లు, రాజ్యాంగ కార్యకర్తల నియామకానికి సంబంధించిన విషయాలతో పాటు ఇతర విషయాలకు సంబంధించిన కేసులను కూడా విచారిస్తుంది.
అలాగే కోర్టు ధిక్కార కేసులను మొదటి మూడు బెంచ్‌లతో పాటు నాల్గవ అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ విచారిస్తారు.

అలాగే సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం హెబియస్ కార్పస్ పిటిషన్లను విచారించనుంది. ఎన్నికల వ్యవహారాలను న్యాయమూర్తులు సూర్యకాంత్, అనిరుద్ధ బోస్ నేతృత్వంలోని సీజేఐ ధర్మాసనం విచారించనుంది. ఇలా కీలకమైన కేసుల విచారణ ఎవరెవరు చేపట్టాలనే అంశాలు తాజా రోస్టర్ లో ఉన్నాయి. వీటి ఆధారంగా ఇకపై న్యాయమూర్తులు తమ దగ్గరకు వచ్చే కేసుల్ని విచారిస్తారు.
సాధారణంగా సుప్రీంకోర్టులో దాఖలయ్యే పిటిషన్లు, ఇతర కేసుల్ని ఎవరెవరు విచారించాలన్న దానిపై ఎప్పటికప్పుడు సీజేఐ తమ విచక్షణాధికారం మేరకు నిర్ణయిస్తారు. వీటినే రోస్టర్ గా పిలుస్తారు. ఈ రోస్టర్ లో సూచించిన విధంగానే న్యాయమూర్తులు, బెంచ్ లు కేసులు స్వీకరించి విచారించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications