ఆ కీలక పిటీషన్‌పై సుప్రీం తీర్పు రిజర్వ్: లక్షలాది కుటుంబాలపై

న్యూఢిల్లీ: దేశంలో కరోనా బారిన పడి అన్ని విధాలుగా నష్టపోయిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని గానీ, ఆర్థిక సహాయాన్ని గానీ అందజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం తన వాదనలను ముగించింది. తీర్పును రిజర్వ్ చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే విషయంపై ఉత్కంఠత నెలకొంది.

కరోనా బారిన పడి దేశవ్యాప్తంగా 3,88,135 మంది మరణించిన విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేసిన లాక్‌డౌన్ వల్ల కోట్లాది కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయాయి. ఆయా కుటుంబాలన్నింటినీ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, ఆ దిశగా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఈ పిటీషన్ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది. తన వైఖరేమిటో స్పష్టం చేయాలని, దాన్ని అఫిడవిట్ రూపంలో అందజేయాలని ఆదేశించింది.

SC reserves judgment on petitions to provide exgratia of Rs 4 lakhs to the Covid victim families

దీనిపై ఆదివారమే కేంద్ర ప్రభుత్వం.. అఫిడవిట్‌ను దాఖలు చేసింది. కోవిడ్ బాధిత కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల మేర నష్ట పరిహారాన్ని గానీ, ఆర్థిక సహాయాన్ని గానీ చేయలేమని కుండబద్దలు కొట్టింది. కోవిడ్ మరణాలు, సంక్షోభ పరిస్థితులు ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ కిందికి రాదని స్పష్టం చేసింది. తాజాగా- కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు. పన్నుల రూపంలో కేంద్రానికి అందుతోన్న నిధులను అవసరార్థులకు మంజూరు చేయడానికి రాష్ట్రాలకు కేటాయించినట్లు తెలిపారు.

Recommended Video

    COVID Third Wave | Easing COVID 19 Curbs | Oneindia Telugu

    రాష్ట్ర స్థాయి ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ విభాగానికి పంపిణీ చేసినట్లు చెప్పారు. దేశంలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాన్ని కల్పించడానికి, ఆక్సిజన్‌ను సమకూర్చుకోవడానికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించాల్సి వచ్చిందని అన్నారు. అదే సమయంలో- లాక్‌డౌన్ సమయంలో బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి ఆర్థిక సహాయం చేశామని, కొన్ని పథకాలను అమలు చేస్తోన్నామని తుషార్ మెహతా చెప్పారు. వాదనలను విన్న తరువాత సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్.. తన తీర్పును రిజర్వ్ చేసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+