వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ సర్కార్‌ది నిరంకుశం,అహేతుకం -వ్యాక్సిన్లు అమ్మడమేంటి? -వాళ్లు పౌరులు కారా? : సుప్రీం సంచలనం

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మహమ్మారి వల్ల ప్రతిరోజూ వేలాది మంది చనిపోతుండగా, మరణాలకు అడ్డుకట్ట వేయదగిన వ్యాక్సినేషన్ ప్రక్రయ పూర్తి గందరగోళంగా మారిన పరిస్థితిలో.. కొవిడ్ సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు సుమోటోగా చేపట్టిన విచారణ సంచలన మలుపులు తిరుగుతున్నది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కేంద్రం అవలంభిస్తున్న విధానాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. మోదీ సర్కారు తీరు నిరంకుశంగా(Arbitrary) అహేతుకంగా(Irrational) ఉందని మండిపడింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ ధర్మాసం ఈ మేరకు బుధవారం అనూహ్య వ్యాఖ్యలు చేసింది.

covid vaccine:ప్రైవేట్ ఆస్పత్రులకు వరం-విదేశాల నుంచి దిగుమతికి మోదీ సర్కార్ ఓకే -250కోట్ల డోసులు:కిషన్ రెడ్డిcovid vaccine:ప్రైవేట్ ఆస్పత్రులకు వరం-విదేశాల నుంచి దిగుమతికి మోదీ సర్కార్ ఓకే -250కోట్ల డోసులు:కిషన్ రెడ్డి

విశాఖ రాజధానిపై సాయిరెడ్డి అనూహ్యం -కోర్టుతో సంబంధంలేదు, జగన్ ఎక్కడైనా ఉండొచ్చు -కానీ తేదీ అడగొద్దువిశాఖ రాజధానిపై సాయిరెడ్డి అనూహ్యం -కోర్టుతో సంబంధంలేదు, జగన్ ఎక్కడైనా ఉండొచ్చు -కానీ తేదీ అడగొద్దు

వ్యాక్సిన్లకు డబ్బులేంటి?

వ్యాక్సిన్లకు డబ్బులేంటి?

కేంద్రం తన వ్యాక్సినేషన్ విధానంలో భాగంగా 45 ఏళ్లు దాటిన వాళ్లకు ఉచితంటా టీకాలు అందిస్తూ, 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారికి మాత్రం రుసుము వసూలు చేయడం సహేతుకం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశ జనాభాలో ఈ ఏజ్ గ్రూప్ వాళ్లే ఎక్కువ ఉండటాన్ని గుర్తుచచేస్తూ.. కొవిడ్‌ రెండో దశ వ్యాప్తిలో ఎక్కువ మంది బాధితులు ఈ వయస్సు వారేనని, వైరస్‌ ప్రభావం కూడా వీరిపై ఎక్కువగానే ఉందని, చాలా మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, అలాంటప్పుడు ఈ ఏజ్ గ్రూపు వారికి ఉచిత వ్యాక్సిన్లు ఇవ్వబోమని కేంద్రం చెప్పడం కచ్చితంగా నిరంకుశత్వమే అవుతందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

కేంద్రం దగ్గర రోడ్ మ్యాప్ ఉందా?

కేంద్రం దగ్గర రోడ్ మ్యాప్ ఉందా?

వ్యాక్సినేషన్‌ విధానం, దాని అమలులోనూ చాలా లోపాలు ఉన్నాయనీ, వెంటనే వాటిని సమీక్షించి, నివృత్తి చేసుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మంగళవారం నాటి విచారణలో.. డిసెంబరు 31 నాటికి అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. ఎలా ముందుకెళ్తారన్న దానిపై రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని సుప్రీం బుధవారం ఆదేశించింది. వ్యాక్సిన్‌ ధరలపై కేంద్రం మరోసారి పరిశీలించాలని చెప్పింది. వైరస్‌లో మార్పులు పుట్టుకొస్తున్న నేపథ్యంలో 18-44 వయస్సు వారికి కూడా వ్యాక్సిన్‌ వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది శాస్త్రీయపద్ధతుల ద్వారా నిర్ణయించాలని కోర్టు స్పష్టం చేసింది.

కొవిన్ పైనా కోర్టు ఫైర్

కొవిన్ పైనా కోర్టు ఫైర్

సరళీకృత టీకాల విధానంలో కొందరు వ్యక్తులు టీకాల కోసం డబ్బులు చెల్లించాల్సి రావడం తగదని, ఆయా వయసుల వారికి పరిమిత సంఖ్యలో టీకాలను రాష్ట్రాలు, యూటీలకు సరఫార చేసి, డిజిటల్ రిజిష్ట్రేషన్ ఉంటేనే తప్ప వ్యాక్సిన్లు వేయబోమని చెప్పడం నిజంగా లోపభూయీష్టవిధానానికి తార్కాణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇంత పెద్ద దేశంలో ఒకే ఒక్క డిజిటిల్ ప్లాట్ ఫామ్ కొవిన్ ద్వారా వ్యాక్సినేష్ ప్రక్రియ మొత్తాన్ని నిర్వహిస్తామనడం సరికాదంది. కొవిన్ ను అందరికీ చేరవేసే మార్గాలను అణ్వేషించాలని, అన్ని సమూహాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.

English summary
The Supreme Court has made a prima facie observation that the Centre's vaccination policy, which does not provide free vaccination for those in the age-group of 18 to 44 years, as "arbitrary and irrational". The observation was made by a bench comprising Justices DY Chandrachud, L Nageswara Rao and S Ravindra Bhat in the suo moto case on COVID-related issues. The Court directed the Union to undertake a "fresh review" of the vaccination policy in the light of the concerns raised by the Court. Universal COVID vaccination can't be achieved by a policy that relies exclusively on digital portal says Supreme Court on CoWin website.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X