జల్లికట్టుపై సుప్రీం స్టే: ప్రభుత్వాలకు నోటీసులు

న్యూఢిల్లీ: జల్లికట్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇన్ని రోజులు సంబరాలు చేసుకున్న తమిళ ప్రజలు మంగళవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో డీలాపడిపోయారు. జల్లికట్టుకు అనుమతిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

క్రూరమైన జంతు హింస కిందకు వచ్చే జల్లికట్టును నిషేధిస్తూ గతంలో ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇదే నెలలో జల్లికట్టుపై విధించిన నిషేదాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో తిమిళ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

SC stays: Centrral government’s notification on Jallikattu in Tamil Nadu

ఇదే సందర్బంలో జంతు పరిరక్షణ సంస్థలతో పాటు పలు స్వచ్చంద సంస్థలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డాయి. ఎలాగైనా జల్లికట్టును అడ్డుకోవాలని నిర్ణయించారు. పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించి జల్లికట్టును నిషేధించాలని మనవి చేశారు.

మంగళవారం సుప్రీం కోర్టులో దాఖలైన అన్ని పిటీషన్లను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సంక్రాంతికి రెండు రోజుల ముందు తమిళ ప్రజలు జల్లికట్టు లేదని తెలుసుకుని నిరాశకు గురైనారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+