వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యాయ వ్యవస్థను అపవిత్రం చేసేందుకు అనుమతించం: సుప్రీంకోర్టు

న్యాయమూర్తుల పేరిట కొందరు ముడుపుల స్వీకరిస్తున్నారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.న్యాయవ్యవస్థను అపవిత్రం చేసేందుకు ఎవరినీ అనుమతించమని సర్వోన్నత న్యాయస్ధానం తేల్చి చెప్పింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: న్యాయమూర్తుల పేరిట కొందరు ముడుపుల స్వీకరిస్తున్నారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.న్యాయవ్యవస్థను అపవిత్రం చేసేందుకు ఎవరినీ అనుమతించమని సర్వోన్నత న్యాయస్ధానం తేల్చి చెప్పింది. చట్టం నుంచి ఎంతటి పెద్దవారైనా తప్పించుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

తీవ్రమైన ఆరోపణలు తలెత్తినప్పుడు కేసు ప్రాధాన్యతను ఎవరూ తగ్గించలేరని జస్టిస్‌ ఏకే సిక్రి, అశోక్‌ భూషణ్‌తో కూడిన సుప్రీం బెంచ్‌ అభిప్రాయపడింది. కేసుల సానుకూల పరిష్కారం కోసం సుప్రీం న్యాయమూర్తుల పేరుతో కొందరు లంచాలు తీసుకుంటున్నారనే పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది.

 SC terms bribe allegations as very serious

ఈ కేసును కూలంకషంగా విచారించాలని, సీబీఐ విచారణను కొనసాగించాలా లేక ప్రత్యేక దర్యాప్తు బృందాన్నినియమించాలా అనేదానిపై నిర్ణయం తీసుకోవాల్సిఉందని బెంచ్‌ పేర్కొంది. మరోవైపు ఈ కేసును తగిన బెంచ్‌కు బదలాయించిన అనంతరం మళ్లీ తమ ముందుకు దీన్ని లిస్ట్‌ చేసిన తీరుపై పిటిషనర్‌ తరపు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ను సుప్రీం ప్రశ్నించింది.

మీరు నా సాయం కోరి ఉంటే దీనిపై తగిన నిర్ణయం తీసుకునేవాడ్ని...పిటిషనర్‌ తీరుపై తాము కలత చెందామని జస్టిస్‌ సిక్రీ ప్రశాంత్‌ భూషణ్‌తో అన్నారు. అయితే తమ పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనం నుంచి ఇతర బెంచ్‌కు బదలాయించారు. ప్రదాన న్యాయమూర్తి ముందస్తు ఆదేశాలకు అనుగుణంగా ఇలా చేశామని కోర్టు రిజిష్టార్ తనకు సమాచారం ఇచ్చారని పిటిషనర్‌ తరపు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టుకు తెలిపారు.

English summary
The Supreme Court today termed the allegations of bribes taken in the name of judges as "very serious" and asserted that no one would be allowed to "impure the stream of justice."The top court observed that whoever, how mighty he is, cannot evade law and said that justice will be delivered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X