Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు: కథువా కేసు విచారణ పఠాన్‌కోట్ కోర్టుకు బదిలీ

న్యూఢిల్లీ: కథువా కేసులో సుప్రీం కోర్టు సోమవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను పఠాన్‌కోట్‌ కోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తు విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. బాధిత కుటుంబానికి, న్యాయవాదికి, సాక్ష్యులకు రక్షణ కల్పించాలని జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

'ప్రతీరోజు వాదనలు జరగాలి. కేసు విచారణ త్వరగతిన పూర్తి కావాలి. కోర్టు విచారణను కెమెరాలో రికార్డు చేయాలి. ఈ కేసులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను నియమించుకునేందుకు జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వానికి అనుమతిస్తున్నాం' అని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో తదుపరి వాదనను జులై 9కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

SC transfers Kathua rape and murder out of J&K, trial to be conducted in Pathankot

కథువాలో 8ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి, ఆపై అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ కేసులో సాంజీరామ్‌ అనే మాజీ ప్రభుత్వ ఉద్యోగితో సహ ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+