School Bus: వరదలో చిక్కుకున్న స్కూల్ బస్సు.. విద్యార్థులను కాపాడిన స్థానికులు..
గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. జామ్నగర్ జిల్లాలో వర్షాలతో చెరువులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. నానా వడాల గ్రామంలో నిన్న ఉదయం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు.. వరద నీటి ప్రవాహంలో బోల్తా పడి అక్కడే నీటిలో చిక్కుకుపోయింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇలోగా వారే బస్సుకు తాళ్లు కట్టి బయటకు లాగారు. ఆ సమయంలో బస్సులో 8 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు, డ్రైవర్ ఉన్నారు. అందరు సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#WATCH | Gujarat: Locals rescue people after their school bus overturned as it got stuck in a turbulent flow of water triggered by heavy rainfall in Kalavad in Jamnagar district pic.twitter.com/k3gEiooWUh
— ANI (@ANI) July 7, 2022












Click it and Unblock the Notifications