అమ్మా ఏందిది.. ప్రిన్సిపల్‌ను కూడా వదల్లే.. దాడి, వీడియో రికార్డ్, వైరల్
అప్పుడప్పుడు విచిత్రాలు జరుగుతుంటాయి. ఈ మధ్య అన్నీ చిత్రాలే.. అవును... భార్యలు భర్తలపై దాడులు చేస్తున్నారు. ఓ భార్య బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. సదరు వ్యక్తి మాములు పర్సన్ కూడా కాదు.. ఓ స్కూల్ ప్రిన్సిపల్... తనకు జరిగిన అన్యాయంపై సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేశాడు. తర్వాత కోర్టులో పిల్ వేయడంతో.. అతనికి భద్రత కల్పించాలని కోర్టు పోలీసు శాఖను కోరింది.

ప్రిన్సిపల్ బాధ్యుడే..
హర్యానాలో ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ భార్యా బాధితుడు అయ్యాడు. అజిత్ యాదవ్ అనే వ్యక్తి హర్యానాలో గల ఖర్కారాలో ప్రభుత్వ పాఠశాలకు ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. అతడికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అజిత్ యాదవ్.. అతడి భార్య సుమన్ యాదవ్ ఇల్లంతా తిప్పి కొడుతున్న దృశ్యాలు కనిపించాయి. కొడుకు చూస్తుండగా ఆమె భర్తపై చేతికందిన వస్తువులతో దాడికి దిగింది.

ఏడేళ్ల కింద పెళ్లి
తమకు ఏడేళ్ల కిందట పెళ్లి జరిగిందని ప్రిన్సిపాల్ అజిత్ యాదవ్ తెలిపారు. తమది ప్రేమ వివాహం అని వివరించారు. ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో తాను ఒక్కసారి కూడా భార్య సుమన్ పై చేయిచేసుకోలేదని వివరణ ఇచ్చాడు. గత ఏడాది నుంచి భార్య చేతిలో తాను దెబ్బలు తినాల్సి వస్తోందని, ఆమె తనను కొట్టడం ఎక్కువైందని వాపోయాడు.

సీసీటీవీ ఫుటేజీ
ఆధారాల కోసం ఇంట్లో సీసీటీవీ కెమెరాలు బిగించానని, వాటిలో నమోదైన ఫుటేజిని కోర్టుకు సమర్పించానని అజిత్ యాదవ్ వెల్లడించాడు. స్థానిక కోర్టు తనకు భద్రత కల్పించేందుకు అంగీకరించిందని తెలిపాడు. ఇదీ నిజంగా విచిత్రమే.. భార్య కొడుతుందని అతను కోర్టును ఆశ్రయించాడు. ఆధారాల కోసం సీసీటీవీ కెమెరా చూపించాడు.












Click it and Unblock the Notifications