విద్యార్థి ఘాతుకం: రన్నింగ్ బస్సులో.. అందరూ చూస్తుండగానే.. ప్రయాణికుడి గొంతు కోసి..
ఢిల్లీలోని గురువారం మధ్యాహ్నం ఓ బస్సు పంజాబీ బాగ్ నుంచి బాదర్‌పూర్ వెళుతూ స్థానిక ఆశ్రమం చౌక్ వద్ద ఆగింది. కొంతమంది ప్రయాణికులతో పాటు 13 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు ఉన్న, స్కూలు యూనిఫాంలో ఉన్న విద్య
ఢిల్లీ: కదులున్న బస్సులోనే కొంతమంది విద్యార్థులు తోటి ప్రయాణికుడితో గొడవ పడ్డారు. వారిలో ఓ విద్యార్థి ఆవేశం పట్టలేక కత్తితీసి ఆ ప్రయాణికుడి మెడపై పొడవగా అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ దారుణం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
ఢిల్లీలోని గురువారం మధ్యాహ్నం ఓ బస్సు పంజాబీ బాగ్ నుంచి బాదర్‌పూర్ వెళుతూ స్థానిక ఆశ్రమం చౌక్ వద్ద ఆగింది. కొంతమంది ప్రయాణికులతో పాటు 13 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు ఉన్న, స్కూలు యూనిఫాంలో ఉన్న విద్యార్థులు ఎక్కారు.

లజపత్ నగర్ దగ్గర ఎక్కిన ఓ ప్రయాణికుడు కాసేపటి తరువాత తన ఫోన్ కనిపించడం లేదంటూ అందరి వద్ద వాకబు చేశాడు. ఎవరు తీసుకున్నారో చూపించాలంటూ అతడు అందరి బ్యాగులు వెతికాడు. అందులో భాగంగా ఈ విద్యార్థుల బ్యాగులు కూడా వెతికాడు. దీంతో కోసం తెచ్చుకున్న విద్యార్థులు అతడితో గొడవ పడ్డారు.
ఒక దశలో ఓ విద్యార్థి ఆగ్రహం పట్టలేక తన వద్ద ఉన్న కత్తితో ఆ ప్రయాణికుడి మెడలో పొడవగా అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ గొడవ చూసి డ్రైవర్ బస్సును కాస్త స్లో చేయగానే విద్యార్థులంతా బస్సు నుంచి దూకి పారిపోయారు.
వారి యూనిఫాం చూస్తుంటే స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లా ఉన్నారని బస్సు డ్రైవర్ పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు డీసీపీ రోమిల్ బానియా చెప్పారు. నిందితుల కోసం లజపత్ నగర్-మధుర రోడ్డు వరకు ఉన్న దాదాపు 15 ప్రభుత్వ పాఠశాలల్లో గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications